తిరుపతిలో దొంగ ఓటర్లు.. రీపోలింగ్‌కు డిమాండ్

దిశ, వెబ్‌డెస్క్: తిరుపతిలోకి భారీగా బయటి వ్యక్తులు వచ్చి దొంగ ఓట్లు వేస్తున్నారని ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. దొంగ ఓట్లు వేస్తన్న వందలమందిని పట్టించామని.. అధికారులు, పోలీసులు ఉన్నది జగన్ కోసం కాదని విమర్శించారు. తిరుపతి అసెంబ్లీ స్థానం పరిధిలో రీపోలింగ్ నిర్వహించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. తిరుపతిలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైందని, బందిపోట్లను తలపించేలా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు. సరిహద్దులు మూసేసి, తనిఖీలు చేసి పోలీసులు పంపించాల్సిందని, కానీ […]

Update: 2021-04-17 04:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: తిరుపతిలోకి భారీగా బయటి వ్యక్తులు వచ్చి దొంగ ఓట్లు వేస్తున్నారని ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. దొంగ ఓట్లు వేస్తన్న వందలమందిని పట్టించామని.. అధికారులు, పోలీసులు ఉన్నది జగన్ కోసం కాదని విమర్శించారు. తిరుపతి అసెంబ్లీ స్థానం పరిధిలో రీపోలింగ్ నిర్వహించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. తిరుపతిలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైందని, బందిపోట్లను తలపించేలా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు.

సరిహద్దులు మూసేసి, తనిఖీలు చేసి పోలీసులు పంపించాల్సిందని, కానీ పోలీసులు చెక్ పోస్టులు ఎందుకు ఎత్తివేశారని చంద్రబాబు ప్రశ్నించారు. మంత్రిపెద్దిరెడ్డికి చెందని పీఎల్ఈర్ కన్వెన్షన్ సెంటర్‌లో వేలమందిని ఉంచారని, పోలీసులు ఎందుకు గుర్తించలేదన్నారు. దొంగ ఓటర్లను పట్టుకున్న టీడీపీ నేతలపై కేసులు పెట్టడం విడ్డూరంగా ఉందని చంద్రబాబు విమర్శించారు.

Tags:    

Similar News