కరోనా మృతులకు రూ.10 లక్షలు పరిహారం చెల్లించాలి : చంద్రబాబు

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.10 లక్షలు పరిహారం చెల్లించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై చంద్రబాబు సోమవారం ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా మృతులకు ప్రభుత్వం రూ. 10 లక్షల పరిహారం చెల్లించాలని, ఆదాయం కోల్పోయిన వారికి రూ. 10 వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 10 డిమాండ్లతో ఈ […]

Update: 2021-06-14 07:20 GMT

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.10 లక్షలు పరిహారం చెల్లించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై చంద్రబాబు సోమవారం ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా మృతులకు ప్రభుత్వం రూ. 10 లక్షల పరిహారం చెల్లించాలని, ఆదాయం కోల్పోయిన వారికి రూ. 10 వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

10 డిమాండ్లతో ఈ నెల 16నుంచి 22 వరకు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. అలాగే ఈ నెల 16న తహసీల్దార్‌ కార్యాలయాలల్లో, 18న రెవెన్యూ డివిజన్‌ కార్యాలయాల్లో, 20న కలెక్టర్‌ కార్యాలయాల్లో వినతి పత్రాలు సమర్పించాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ నెల 22న 175 నియోజకవర్గాల్లో నిరసన దీక్షలు చేపడుతున్నట్లు ప్రకటించారు. మరోవైపు పన్నుల పెంపునకు నిరసనగా ఈ నెల 15, 16 తేదీల్లో అఖిలపక్ష పార్టీలు నిరసనలకు పిలుపునిచ్చాయి. ఆ నిరసనకు చంద్రబాబు సంఫీుభావం ప్రకటించారు.

Tags:    

Similar News