చంద్రబాబు ఏడుపుపై సీఎం జగన్ సంచలన కామెంట్స్

దిశ, ఏపీ బ్యూరో: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు శపథంపై ఏపీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు. అంతేకాకుండా చంద్రబాబు దొంగ ఏడుపు ఏడుస్తున్నారంటూ విమర్శించారు. కళ్ల వెంట నీరు రాకపోయినా వచ్చినట్లు తెగ నటిస్తున్నారంటూ విమర్శించారు. అయితే చంద్రబాబు అనుకూల మీడియా మాత్రం చంద్రబాబు ఏడుస్తున్నారు అంటూ ఆయనకు సానుభూతి వచ్చేలా పెద్దపెద్ద స్క్రోలింగ్‌లు వేస్తూ నానా హంగామా చేస్తున్నారంటూ జగన్ ఆరోపించారు. చంద్రబాబు కుటుంబ సభ్యులను మా మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరూ కూడా వ్యక్తిగతంగా […]

Update: 2021-11-19 04:03 GMT

దిశ, ఏపీ బ్యూరో: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు శపథంపై ఏపీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు. అంతేకాకుండా చంద్రబాబు దొంగ ఏడుపు ఏడుస్తున్నారంటూ విమర్శించారు. కళ్ల వెంట నీరు రాకపోయినా వచ్చినట్లు తెగ నటిస్తున్నారంటూ విమర్శించారు. అయితే చంద్రబాబు అనుకూల మీడియా మాత్రం చంద్రబాబు ఏడుస్తున్నారు అంటూ ఆయనకు సానుభూతి వచ్చేలా పెద్దపెద్ద స్క్రోలింగ్‌లు వేస్తూ నానా హంగామా చేస్తున్నారంటూ జగన్ ఆరోపించారు.

చంద్రబాబు కుటుంబ సభ్యులను మా మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరూ కూడా వ్యక్తిగతంగా మాట్లాడలేదన్నారు. చంద్రబాబు నాయుడు తమ కుటుంబ సభ్యులను వ్యక్తిగతంగా విమర్శించారని అయినప్పటికీ తాను ఏమీ మాట్లాడలేదన్నారు. తన చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్యను చంద్రబాబు ఎంతో రాజకీయం చేశారని ధ్వజమెత్తారు. మా చిన్నాన్నను వైఎస్ అవినాశ్ రెడ్డితోపాటు మా రక్త సంబంధీకులే హత్య చేశారంటూ చంద్రబాబు నిండు సభలో ఆరోపిస్తుంటే తాము మాట్లాడలేదని ఓపికపట్టామని తెలిపారు.

ఒక కన్ను మరో కన్నును ఎందుకు పొడిచుకుంటుంది అని ప్రశ్నించారు. ఈ విషయంలో అవినాశ్ రెడ్డిపై దుష్ప్రచారం చేశారని అందుకే వివాదం మెుదలైందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాస్తవానికి మా పార్టీ అభ్యర్థి అయినటువంటి వైఎస్ వివేకానందరెడ్డి గెలవాలని, కానీ టీడీపీ కుట్రలకు తెరలేపిందన్నారు. మా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను ప్రలోభాలకు గురి చేసి మా చిన్నాన్నను ఓడించింది ఈ చంద్రబాబు అండ్ కో అని సీఎం జగన్ ఆరోపించారు. చంద్రబాబు ఎంత దొంగ ఏడుపులు ఏడ్చినా ప్రజలు నమ్మరన్నారు. పైన దేవుడు ఉన్నాడంటూ సీఎం జగన్ అసెంబ్లీలో వివరణ ఇచ్చారు.

వైసీపీ నేతలు నా భార్య క్యారెక్టర్‌ను కించపరిచారు.. చంద్రబాబు కన్నీరు

Tags:    

Similar News