రామతీర్థం వైపు కదిలిన చంద్రబాబు కాన్వాయ్

దిశ, వెబ్‌డెస్క్ : విజయనగరం జిల్లా రామతీర్థం ఆలయంలోని విగ్రహాల ధ్వంసంపై పొలిటికల్ వార్ కొనసాగుతోంది. ముందుగా ఎంపీ విజయసాయిరెడ్డి కొండపైకి ఎక్కి ఆలయాన్ని సందర్శించి వచ్చారు. అదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రావడంతో ఆయన కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఒక్క చంద్రబాబు కాన్వాయ్ మినహా టీడీపీ శ్రేణుల వాహనాలను అనుమతించేది లేదని అధికారులు తేల్చి చెప్పడంతో చంద్రబాబు ఆగిపోయారు. ప్రస్తుతం కొత్తపేట నుంచి చంద్రబాబు కాన్వాయ్ రామతీర్థానికి బయలుదేరింది. ఇప్పటికే టీడీపీ శ్రేణులు అక్కడకు […]

Update: 2021-01-02 02:50 GMT

దిశ, వెబ్‌డెస్క్ : విజయనగరం జిల్లా రామతీర్థం ఆలయంలోని విగ్రహాల ధ్వంసంపై పొలిటికల్ వార్ కొనసాగుతోంది. ముందుగా ఎంపీ విజయసాయిరెడ్డి కొండపైకి ఎక్కి ఆలయాన్ని సందర్శించి వచ్చారు. అదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రావడంతో ఆయన కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఒక్క చంద్రబాబు కాన్వాయ్ మినహా టీడీపీ శ్రేణుల వాహనాలను అనుమతించేది లేదని అధికారులు తేల్చి చెప్పడంతో చంద్రబాబు ఆగిపోయారు.

ప్రస్తుతం కొత్తపేట నుంచి చంద్రబాబు కాన్వాయ్ రామతీర్థానికి బయలుదేరింది. ఇప్పటికే టీడీపీ శ్రేణులు అక్కడకు భారీగా చేరుకున్నారు. రామతీర్థం అంతా రామనామ స్మరణతో మారుమ్రోగుతోంది. హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులను వైసీపీ ప్రభుత్వమే చేయిస్తుందని ఓవైపు బీజేపీ నాయకులు, మరోవైపు టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. నిరసన కారులను చెదరగొట్టేందుకు పోలీసులు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.

Tags:    

Similar News