సైకిల్ గాలి వీస్తోందా..?..చంద్రబాబు ధీమా వెనుక అసలు కథ అదన్న మాట?

ఏపీలో మరో ఏడాదిన్నరలో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. వైసీపీ, టీడీపీ అధినేతలిద్దరూ ...Chandrababu Confedence again Win Next Election..

Update: 2022-11-16 12:03 GMT

దిశ వెబ్ డెస్క్: ఏపీలో మరో ఏడాదిన్నరలో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. వైసీపీ, టీడీపీ అధినేతలిద్దరూ ఇప్పటి నుంచే ఎన్నికలకు వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఇద్దరు నేతలు కూడా కింద స్థాయి నేతలు, కార్యకర్తలతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కించేందుకుకు పార్టీ నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు.

అయితే టీడీపీ అధినేత చంద్రబాబు ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఎక్కడ పర్యటనకు వెళ్లినా.. సభ పెట్టినా గతం కంటే జనాల నుంచి భారీ స్పందన వస్తోంది. దీంతో చంద్రబాబు వరుస పెట్టి అన్ని నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు. తాజాగా కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. మూడు రోజులు పాటు ఆయన రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఈ రోజు కర్నూలు జిల్లా కోడుమూరులో పర్యటించారు. రోడ్ షో నిర్వహించారు.ఈ పర్యటనలో చంద్రబాబు చెబుతున్నది ఒక్కటే మాట. ఈ సారి రాష్ట్రంలో సైకిల్ గాలి వీస్తోందని.. ఆ గాలిలో వైసీసీ కొట్టుకుపోతుందని చెబుతున్నారు. రాష్ట్రంలో అవినీతి, అక్రమాలకు తావుఉండదని.. వాటికి ప్రతి రూపమైన జగన్‌కు ఇదే చివరి అవకాశమని చంద్రబాబు విమర్శలు చేస్తున్నారు.

అయితే చంద్రబాబు ధీమాకు కారణం ఉందని కొందరు నేతలు అంటున్నారు.. ఇటీవల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు సర్వే చేయించారని.. అందులో టీడీపీకి అనుకూలంగా కొంత వచ్చిందని. కొంచెం కష్టపడితే ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయని తేలినట్లు చెబుతున్నారు.  అందుకే చంద్రబాబు ఫుల్ జోష్‌లో ఉన్నారని పేర్కొంటున్నారు. అటు తనయుడు నారా లోకేశ్‌తో పాదయాత్ర ఐడియా కూడా చంద్రబాబుదేనని తెలుస్తోంది. తనయుడు రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తే పార్టీకి మరింత బలం పెరుగుతుందని ఆయన భావించారని.. అందుకే ఆ కార్యక్రమానికి తెర తీశారని చెబుతున్నారు.

అలాగే కొందరికి పార్టీ టికెట్లపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చారని.. ఆయా నియోజకవర్గాల్లో తిరగాలని.. పార్టీ బలోపేతంపై దృష్టి సారించాలని వారికి చంద్రబాబు సూచించారట. 'బాదుడే బాదుడు' కార్యక్రమాన్ని ప్రతి నియోజకవర్గంలో నిర్వహించి ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు ఇప్పటికే దిశానిర్దేశం చేశారట. టీడీపీని అధికారంలోకి తీసుకువచ్చేలా ఇప్పటి నుంచే లక్ష్యంగా పెట్టుకుని ప్రతి ఒక్క నేత, కార్యకర్త ప్రజల్లోకి వెళ్లాలని సూచించారట. అటు టీడీపీ మహిళా అధ్యక్షురాలు కూడా త్వరలో 'మాటా మంతి' కార్యక్రమంతో ప్రజల్లోకి పంపేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. 2024 ఎన్నికల్లో టీడీపీకి అధికారం ఖాయమంటూ చంద్రబాబు చెప్పడం వెనుక సర్వే రిపోర్టేనని తెలుస్తోంది. మరి ఈ సర్వే రిపోర్టు ప్రకారం చంద్రబాబుకు 2024 ఎన్నికలు ఊరటనిస్తాయేయో చూడాలి. 

ఇవి కూడా చదవండి : Pawan Kalyan దూకుడుకు YSRCP వెనకడుగు వెయ్యబోతుందా ?

Tags:    

Similar News