‘ప్రభుత్వం ఉండి ఉపయోగం ఏంటి’

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ కొవిడ్ ఆస్పత్రుల్లో పేషంట్ల ఆందోళనలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే విశాఖ విమ్స్, కర్నూలు విశ్వభారతి ఆస్పత్రుల్లో పేషంట్ల ఆందోళన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే, తాజాగా శ్రీకాకుళం రిమ్స్‌లో ఓ పేషంట్ ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియోను షేర్ చేశాడు. తన ముక్కులో నుంచి రక్తం కారుతున్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయాడు. అయితే, ఈ వీడియోను తన ట్విట్టర్‌లో షేర్ చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు […]

Update: 2020-08-07 05:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ కొవిడ్ ఆస్పత్రుల్లో పేషంట్ల ఆందోళనలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే విశాఖ విమ్స్, కర్నూలు విశ్వభారతి ఆస్పత్రుల్లో పేషంట్ల ఆందోళన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే, తాజాగా శ్రీకాకుళం రిమ్స్‌లో ఓ పేషంట్ ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియోను షేర్ చేశాడు. తన ముక్కులో నుంచి రక్తం కారుతున్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయాడు. అయితే, ఈ వీడియోను తన ట్విట్టర్‌లో షేర్ చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు.

ఏపీలో వైద్య పరిస్థితులు ఎంత దయనీయంగా ఉన్నాయో చూడండి అంటూ వీడియో షేర్ చేశారు. చంద్రబాబు. ‘ఎంతో భవిష్యత్తు ఉన్న 30 ఏళ్ల యువకుడు తల్లిని కాపాడమంటూ, తన ప్రాణాలు నిలపమంటూ హృదయవిదారకంగా వేడుకుంటున్నా ఎవరూ పట్టించుకోవట్లేదంటే… ప్రభుత్వం ఉండి ఉపయోగం ఏంటి’ అని నిలదీశారు. శ్రీకాకుళం రిమ్స్ లోని ఈ పేషంట్ లను తక్షణం ఆదుకోండి అంటూ ఆయన డిమాండ్ చేశారు.

Tags:    

Similar News