వాళ్లు వినేరకం కాదు: చంద్రబాబు
దిశ, వెబ్ డెస్క్: మంచి చెబితే వైసీపీ వాళ్లు వినేరకం కాదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తాము పట్టిందానికి మూడే కాళ్లు అనే మొండివాళ్లని విమర్శలు చేశారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఆయన ట్విట్టర్ వేదికగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వైసీపీ సర్కార్‌పై పలు విమర్శలు చేశారు. మాతృభాష నేర్చుకోవడం అమ్మ నుంచి సంక్రమించిన హక్కు అని.. ఆ హక్కును ఏ ప్రభుత్వాలు కూడా కాలరాయకూడదని సూచించారు. ఏ మాధ్యమంలో చదువుకోవాలో […]
దిశ, వెబ్ డెస్క్: మంచి చెబితే వైసీపీ వాళ్లు వినేరకం కాదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తాము పట్టిందానికి మూడే కాళ్లు అనే మొండివాళ్లని విమర్శలు చేశారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఆయన ట్విట్టర్ వేదికగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వైసీపీ సర్కార్‌పై పలు విమర్శలు చేశారు. మాతృభాష నేర్చుకోవడం అమ్మ నుంచి సంక్రమించిన హక్కు అని.. ఆ హక్కును ఏ ప్రభుత్వాలు కూడా కాలరాయకూడదని సూచించారు. ఏ మాధ్యమంలో చదువుకోవాలో ఎంచుకునే స్వేచ్ఛ విద్యార్థులకు ఇవ్వాలని వైసీపీ పాలకులను కోరామని చంద్రబాబు తెలిపారు.
బోగస్ సర్వేలు, నకిలీ కమిటీలతో తమ పంతం నెరవేర్చుకోవాలని చూడటం బాధాకరని చంద్రబాబు అన్నారు. విద్యార్థుల స్వేచ్ఛ హరించడం హేయమన్నారు. పైగా తెలుగుదేశం పార్టీ ఆంగ్ల మాధ్యమానికి వ్యతిరేకమని చిత్రీకరించడం దారుణంగా ఉందన్నారు. ఆంగ్లభాషా బోధనను ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టిందే తెలుగుదేశం ప్రభుత్వం అని గుర్తుచేశారు. దీనిని 40 శాతం పాఠశాలల్లో అమలు చేశామని.. అయితే, ఆంగ్లభాషలోనే చదవాలని ఎప్పుడూ నిర్బంధం చేయలేదన్నారు. తెలుగు భాషా సంస్కృతులను పరిరక్షించడానికి టీడీపీ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని చంద్రబాబు ట్విట్టర్ వేదికగా తెలియజేశారు.