మూగబోయిన మగ్గం చప్పుడు.. రెండ్రోజులుగా దీక్ష

దిశ, మునుగోడు: కరోనా నేపథ్యంలో చేనేత కార్మికులకు పనులు లేక కుటుంబాలు పస్తులుండే పరిస్థితి ఏర్పడిందని, చేనేత పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయి దిక్కుతోచని స్థితిలో కార్మికులు రోడ్డున పడ్డారని నిరసన దీక్ష చేపట్టారు. నల్లగొండ జిల్లా చండూర్ మున్సిపాలిటీలోని స్థానిక చౌరస్తాలో సోమవారం చేనేత కార్మికులు చేపట్టిన నిరాహార దీక్షలు మంగళవారంతో రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా మాస్టర్ వివర్స్ అధ్యక్షులు జూలూరు ఆంజనేయులు, కార్మిక సంఘం అధ్యక్షులు తిరందాసు శ్రీను మాట్లాడారు. కరోనా సంక్షోభం […]

Update: 2020-07-14 05:40 GMT

దిశ, మునుగోడు: కరోనా నేపథ్యంలో చేనేత కార్మికులకు పనులు లేక కుటుంబాలు పస్తులుండే పరిస్థితి ఏర్పడిందని, చేనేత పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయి దిక్కుతోచని స్థితిలో కార్మికులు రోడ్డున పడ్డారని నిరసన దీక్ష చేపట్టారు. నల్లగొండ జిల్లా చండూర్ మున్సిపాలిటీలోని స్థానిక చౌరస్తాలో సోమవారం చేనేత కార్మికులు చేపట్టిన నిరాహార దీక్షలు మంగళవారంతో రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా మాస్టర్ వివర్స్ అధ్యక్షులు జూలూరు ఆంజనేయులు, కార్మిక సంఘం అధ్యక్షులు తిరందాసు శ్రీను మాట్లాడారు. కరోనా సంక్షోభం కారణంగా చేనేత కార్మికులకు గత నాలుగు నెలలుగా, మగ్గం చప్పుడు మూగబోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత పట్ల వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. చేనేత సంఘాలలో ఇప్పటివరకూ నిలువలుగా పేరుకుపోయిన వస్త్రాలను వెంటనే కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రతి చేనేత కార్మికునికి కుటుంబానికి కరోనా భృతి కింద నెలకు రూ.8000 అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. చేనేత వస్త్రాలపై కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందజేస్తున్న బీమాను చేనేత కార్మికులకు చేనేత బంధు పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆకలి చావులకు చనిపోయిన కార్మికుని కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని తెలిపారు. ప్రభుత్వాలు చేనేతల సమస్యలను పరిష్కరించేంతవరకూ దీక్షను కొనసాగిస్తామని తెలిపారు.

Tags:    

Similar News