నేలకొండపల్లిలో చైన్ స్నాచింగ్..

దిశ, పాలేరు : ఉమ్మడి ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం బైరవునిపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై వచ్చిన గుర్తుతెలియని దుండగులు చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డాడు. వివరాల్లోకివెళితే.. గ్రామానికి చెందిన రేపాల సీతమ్మ అనే మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును దుండగులు లాక్కెళ్లిన ఘటన ఆదివారం ఉదయం వెలుగుచూసింది. మద్యం కోసం వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమెను మాటల్లో పెట్టారు. ఉన్నట్టుండి సీతమ్మ దృష్టిని మరల్చి ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసు లాక్కెళ్లారని […]

Update: 2021-10-10 04:52 GMT

దిశ, పాలేరు : ఉమ్మడి ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం బైరవునిపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై వచ్చిన గుర్తుతెలియని దుండగులు చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డాడు. వివరాల్లోకివెళితే.. గ్రామానికి చెందిన రేపాల సీతమ్మ అనే మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును దుండగులు లాక్కెళ్లిన ఘటన ఆదివారం ఉదయం వెలుగుచూసింది. మద్యం కోసం వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమెను మాటల్లో పెట్టారు. ఉన్నట్టుండి సీతమ్మ దృష్టిని మరల్చి ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసు లాక్కెళ్లారని బాధితులు వెల్లడించింది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఆమె తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.

Tags:    

Similar News