కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు మారాలి: చాడ వెంకట్ రెడ్డి
దిశ, పెద్దపల్లి: కేంద్రంలో మోడీ మొండి పాలన కొనసాగుతుందని, దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా అమ్ముతూ అదోగతి పాలు చేస్తున్నారని చాడ వెంకట్ రెడ్డి విమర్శించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సీపీఐ ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల రాజకీయ శిక్షణ తరగతులు మంగళవారం రోజున ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఈ శిక్షణ తరగతులకు ముఖ్య అతిథిగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి పాల్గొని ముందుగా పార్టీ జెండా అవిష్కరించారు. అనంతరం ఆయన […]
దిశ, పెద్దపల్లి: కేంద్రంలో మోడీ మొండి పాలన కొనసాగుతుందని, దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా అమ్ముతూ అదోగతి పాలు చేస్తున్నారని చాడ వెంకట్ రెడ్డి విమర్శించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సీపీఐ ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల రాజకీయ శిక్షణ తరగతులు మంగళవారం రోజున ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఈ శిక్షణ తరగతులకు ముఖ్య అతిథిగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి పాల్గొని ముందుగా పార్టీ జెండా అవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జీవిత బీమా, రైల్వే, బీఎస్‌ఎన్‌ఎల్, ఎయిర్ ఫోర్స్, చివరికి రక్షణ రంగాన్ని కేంద్ర ప్రభుత్వం.. ప్రైవేట్ పరం చేయడం దుర్మార్గం అని మండిపడ్డారు.
అదే విధంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వ ధోరణి అవలంభిస్తూ నియంత పాలన కొనసాగిస్తున్నారన్నారు. ఒక వైపు రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ మరో వైపు రైతు ధర్నాల పేరుతో దొంగ నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే కేంద్రంలోని మోడీ, రాష్ట్రంలో కేసీఆర్.. సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ ఎన్నికల్లో లబ్ధి పొందే విధంగా కుయుక్తులు పన్నుతున్నారని అన్నారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ విధానాలు ప్రజలు గమనిస్తున్నారని.. మొన్న జరిగిన మహోత్తరా రైతు పోరాటమే ఇందుకు చెంపపెట్టు లాంటిదని అభివర్ణించారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ విధానాలను మార్చుకోవాలని హితవు పలికారు.