‘కరోనా సంక్షోభంలో ప్రభుత్వాల దోపిడీ’
దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలో కరోనా సంక్షోభ సమయంలో కూడా కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వాలు కొవిడ్ వ్యాక్సిన్లు, ఔషదాలపై జీఎస్టీ విధిస్తు వేల కోట్ల రూపాయలను దోచుకుంటున్నాయని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి విమర్శించారు. కరోనా వ్యాక్సిన్లు, ఔషదాలపై జీఎస్టీ రద్దు చేయాలనీ డిమాండ్ చేస్తూ సీపీఐ హైదరాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో మంగళవారం బషీర్ బాగ్ జీఎస్టీ భవన్ ఎదుట ధర్నా జరిగింది. ఈ ప్రదర్శన సందర్భంగా సీపీఐ […]
దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలో కరోనా సంక్షోభ సమయంలో కూడా కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వాలు కొవిడ్ వ్యాక్సిన్లు, ఔషదాలపై జీఎస్టీ విధిస్తు వేల కోట్ల రూపాయలను దోచుకుంటున్నాయని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి విమర్శించారు. కరోనా వ్యాక్సిన్లు, ఔషదాలపై జీఎస్టీ రద్దు చేయాలనీ డిమాండ్ చేస్తూ సీపీఐ హైదరాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో మంగళవారం బషీర్ బాగ్ జీఎస్టీ భవన్ ఎదుట ధర్నా జరిగింది. ఈ ప్రదర్శన సందర్భంగా సీపీఐ కార్యకర్తలు ప్లకార్డులు పట్టుకొని కొవిడ్ ఔషదాలు, వ్యాక్సిన్లు పై జీఎస్టీ రద్దు చేయాలనీ, ప్రజారోగ్యాన్ని కాపాడాలని, ప్రజల ప్రాణాలు రక్షించాలని పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా విచ్చేసిన చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు చనిపోతున్నప్పుడు, కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్లపై 5 శాతం, రెమిడెసివిర్ పై 12 శాతం, ఇతర మందులు, ఆక్సిజన్ పై 18 శాతం, శానిటైజర్లపై 18 శాతం, అంబులెన్స్లపై 28 శాతం జీఎస్టీ ను ఎందుకు సేకరిస్తోందని ప్రశ్నించారు.
అధిక ధరల కరోనా మందులు కొనలేక, ప్రైవేట్ ఆసుపత్రులు వేసే లక్షల బిల్లులను చెల్లించలేక, చికిత్స కోసం ఆస్తులు అమ్ముకొని సామాన్య ప్రజలు రోడ్డున పడుతున్నారని అయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రలోని మోదీ ప్రభుత్వ అహంకార, అసమర్థ పాలనే దేశంలో కోట్లాది మంది భారతీయుల దుస్థితికి కారణమౌతుందని అయన మండిపడ్డారు. సంక్షోభ సమయాల్లో డబ్బు దండుకోవడం మాని, పౌరుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కొవిడ్ 19 ఔషదాలు, వ్యాక్సిన్లు, ఆక్సిజన్ సాంద్రతలు, వెంటిలేటర్లు వంటి కీలక వైద్య వస్తువులపై విధిస్తున్న జీఎస్టీ రేట్లను రద్దు చేయాలని చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు.