ఓటీటీలో ‘చాచా చౌదరి’ చమక్కులు

దిశ, వెబ్ డెస్క్ : ఇండియన్ కామిక్ సిరీస్ ‘చాచా చౌదరి’ త్వరలోనే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై తొలిసారిగా ప్రసారం కాబోతోంది. తిరువనంతపురానికి చెందిన ‘టూన్జ్ మీడియా గ్రూప్’ ఇందుకు సంబంధించిన హక్కులు తీసుకుంది. కాగా ‘డిస్నీ+ హాట్‌స్టార్‌లో త్వరలోనో ప్రసారం కానున్నఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అందరినీ అలరిస్తుంది’ అని టూన్జ్ మీడియా గ్రూప్ సీఈవో జయకుమార్ వెల్లడించారు. చాచా చౌదరి అనేది ‘ఇండియన్ కామిక్ బుక్ క్యారెక్టర్’. ప్రాణ్ కుమార్ శర్మ 1971లో ఈ క్యారెక్టర్‌కు ప్రాణం […]

Update: 2020-06-13 02:28 GMT

దిశ, వెబ్ డెస్క్ :
ఇండియన్ కామిక్ సిరీస్ ‘చాచా చౌదరి’ త్వరలోనే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై తొలిసారిగా ప్రసారం కాబోతోంది. తిరువనంతపురానికి చెందిన ‘టూన్జ్ మీడియా గ్రూప్’ ఇందుకు సంబంధించిన హక్కులు తీసుకుంది. కాగా ‘డిస్నీ+ హాట్‌స్టార్‌లో త్వరలోనో ప్రసారం కానున్నఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అందరినీ అలరిస్తుంది’ అని టూన్జ్ మీడియా గ్రూప్ సీఈవో జయకుమార్ వెల్లడించారు.

చాచా చౌదరి అనేది ‘ఇండియన్ కామిక్ బుక్ క్యారెక్టర్’. ప్రాణ్ కుమార్ శర్మ 1971లో ఈ క్యారెక్టర్‌కు ప్రాణం పోశారు. హిందీ, ఇంగ్లీష్‌తో పాటు మరో పది ఇండియన్ లాంగ్వేజెస్‌లలో ఈ కామిక్ బుక్ వస్తుండగా.. ఇప్పటికే 10 మిలియన్ కాపీలు అమ్ముడు పోయాయి. ఈ కామిక్ సిరీస్‌ను టెలివిజన్ సిరీస్‌‌ గానూ చేయడం విశేషం.

హిస్టరీ..

‘చాచా చౌదరి’ అనే క్యారెక్టర్‌ను మొదట హిందీ మ్యాగజైన్ ‘లాట్‌పాట్’ కోసం డిజైన్ చేశారు. అతి తక్కువ కాలంలోనే ఈ క్యారెక్టర్ చిన్నారులతో పాటు పెద్దలను విపరీతంగా ఆకట్టుకుంది. కాగా ఫిలాసఫర్ ‘చాణక్య’తో పాటు ప్రతి గ్రామంలో ఉండే తెలివైన పెద్ద మనుషుల నుంచి స్ఫూర్తి పొంది ‘చాచా చౌదరి’ క్యారెక్టర్‌ను ప్రాణ్ రూపొందించారు. మిడిల్ క్లాస్ ఇండియన్ అయిన చాచా చౌదరి.. తన తెలివితో ఊళ్లో ప్రతి ఒక్కరి కష్టాన్ని తీరుస్తుంటారు. అలా కామన్ సెన్స్‌ను ఉపయోగిస్తూ.. హ్యూమర్ టచ్ అందించే చాచా చౌదరి చమక్కులకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఈ క్యారెక్టర్ మిగతా కార్టూన్ సూపర్ హీరోలతో పోల్చుకుంటే చాలా భిన్నమైంది. అతడు వారిలాగా బలవంతుడు కాదు, అతీత శక్తులేవీ కూడా ఉండవు. ఓ సాదాసీదా మనిషి. కానీ అతడి మెదడు.. సూది మొన కన్నా పదునైనది, సూపర్ కంప్యూటర్ కన్నా వేగవంతమైనది. చాచాతో ఉండే సాబు, పెట్ డాగ్ రాకెట్ కూడా ఆయనతో పాటు స్క్రీన్‌పై నవ్వులు పూయిస్తాయి.

సీజన్ 2..

సీజన్ 2 కూడా త్వరలోనే రాబోతుందని టూన్జ్ మీడియా తెలిపింది. 52 ఎపిసోడ్లుగా వస్తుందని తెలియజేశారు. సీజన్ 2 డిస్నీ హాట్ స్టార్‌తో పాటు డిస్నీ కిడ్స్ చానలె‌లోనూ ప్రసారం కానుంది.

Tags:    

Similar News