జూన్ 21 నుంచి ఫ్రీ వ్యాక్సిన్.. కేంద్రం మార్గదర్శకాలు ఇవే..
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో టీకా పంపిణీ కార్యక్రమానికి సంబంధించి కేంద్రం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. జాన్ 21వ తేదీ నుంచి దేశంలో 18 ఏళ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తామని కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం వ్యాక్సినేషన్‌కు సంబంధించిన కొత్త మార్గదర్శకాలను కేంద్రం వెలువరించింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల జనాభా, వ్యాధి తీవ్రత, వ్యాక్సినేషన్ పురోగతి అంశాల ఆధారంగా టీకా డోసుల పంపిణీ ఉంటుందని మార్గదర్శకాల్లో వెల్లడించింది. […]
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో టీకా పంపిణీ కార్యక్రమానికి సంబంధించి కేంద్రం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. జాన్ 21వ తేదీ నుంచి దేశంలో 18 ఏళ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తామని కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం వ్యాక్సినేషన్‌కు సంబంధించిన కొత్త మార్గదర్శకాలను కేంద్రం వెలువరించింది.
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల జనాభా, వ్యాధి తీవ్రత, వ్యాక్సినేషన్ పురోగతి అంశాల ఆధారంగా టీకా డోసుల పంపిణీ ఉంటుందని మార్గదర్శకాల్లో వెల్లడించింది. రాష్ట్రాల అవసరాల రీత్యా ప్రతీ రాష్ట్రానికి వారికి అందిన డోసులను బట్టి.. టీకా ప్రాధాన్యతా క్రమాన్ని నిర్ణయించుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. ప్రైవేటు ఆస్పత్రులకు సంబంధించి టీకా ధరను తయారీ సంస్థలే నిర్ణయిస్తాయని కేంద్రం తెలిపింది. ఒక్కో డోసుకు రూ.150కి మించకుండా సర్వీస్ ఛార్జీ వసూలు చేయవచ్చని పేర్కొంది. ఈ క్రమంలోనే జూన్ 21 నుంచి ఈ మార్గదర్శకాలు అమలులోకి వస్తాయని తెలిపింది. టీకా పంపిణీకి సంబంధించి రాష్ట్రాలకు ముందుగానే సమాచారం అందిస్తామని కేంద్రం ఓ ప్రకటనలో పేర్కొంది.