హర్షగూడ లో కేంద్ర బృందం పర్యటన

దిశ,రంగారెడ్డి మహేశ్వరం: కేంద్ర మానిటరింగ్ బృందం, ప్రొఫెసర్ సౌండర్ పాండియన్ నేతృత్వంలో చెన్నై స్కూల్ ఆఫ్ మేనేజమెంట్ గాంధీగ్రామ్ ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్ నెహ్రు శనివారం మహేశ్వరం మండలం హర్షగూడ గ్రామంలో పర్యటించారు. గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా అమలవుతున్న పనులను పరిశీలించి, ఉపాధి హామీ కూలీలకు సకాలంలో డబ్బులు వస్తున్నాయా లేదా అని కూలీలను అడిగి తెలుసుకున్నారు. పావలా వడ్డీ రుణాల మంజూరు, చెల్లింపు విధానం పై మహిళ సంఘాల సభ్యుల […]

Update: 2021-10-23 09:11 GMT

దిశ,రంగారెడ్డి మహేశ్వరం: కేంద్ర మానిటరింగ్ బృందం, ప్రొఫెసర్ సౌండర్ పాండియన్ నేతృత్వంలో చెన్నై స్కూల్ ఆఫ్ మేనేజమెంట్ గాంధీగ్రామ్ ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్ నెహ్రు శనివారం మహేశ్వరం మండలం హర్షగూడ గ్రామంలో పర్యటించారు. గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా అమలవుతున్న పనులను పరిశీలించి, ఉపాధి హామీ కూలీలకు సకాలంలో డబ్బులు వస్తున్నాయా లేదా అని కూలీలను అడిగి తెలుసుకున్నారు. పావలా వడ్డీ రుణాల మంజూరు, చెల్లింపు విధానం పై మహిళ సంఘాల సభ్యుల నుంచి వివరాలను సేకరించారు. ఈ కార్యక్రమంలో హర్షగూడ గ్రామ సర్పంచ్ పాండు నాయక్, ఎంపీటీసీ విజయ్ కుమార్, ఏపిడీ నీరజ, ఎంపిడివో నర్సింహులు, ఎంపివో రవీందర్ రెడ్డి, ఏఈ అనిల్ కుమార్, ఏపీయం సత్య నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News