సెకండ్ వేవ్ ఎఫెక్ట్: రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు

దిశ, వెబ్‌డెస్క్: కరోనా కట్టడికి కేంద్ర హోంశాఖ మరోమారు రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా తీవ్రత దృష్ట్యా రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని, కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ఆదేశించింది. అన్ని రాష్ట్రాలు ఆర్టీపీసీఆర్ పరీక్షలు 70 శాతం పెంచాలని ఆదేశించింది. కరోనా వచ్చిన వారికి సరైన చికిత్స అందించాలని, రద్దీ, పని ప్రదేశాల్లో పకడ్బందీ చర్యలు, జాగ్రత్తలు చేపట్టాలంది. రాష్ట్రాల మధ్య రాకపోకలకు సంబంధించి ఎలాంటి ఆంక్షలు పెట్టవద్దని ఆదేశించింది.

Update: 2021-03-23 07:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా కట్టడికి కేంద్ర హోంశాఖ మరోమారు రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా తీవ్రత దృష్ట్యా రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని, కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ఆదేశించింది. అన్ని రాష్ట్రాలు ఆర్టీపీసీఆర్ పరీక్షలు 70 శాతం పెంచాలని ఆదేశించింది.

కరోనా వచ్చిన వారికి సరైన చికిత్స అందించాలని, రద్దీ, పని ప్రదేశాల్లో పకడ్బందీ చర్యలు, జాగ్రత్తలు చేపట్టాలంది. రాష్ట్రాల మధ్య రాకపోకలకు సంబంధించి ఎలాంటి ఆంక్షలు పెట్టవద్దని ఆదేశించింది.

Tags:    

Similar News