డేంజర్.. అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంపై కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. టెస్ట్, ట్రాక్, ట్రీట్ విధానాన్ని వేగవంతం చేయాలని ఆదేశించింది. కోవిడ్ నిబంధనలు మరింత కఠినతరం చేయాలని సూచించింది. పాజిటివ్ వచ్చిన వారిని ఐసోలేట్ చేసి చికిత్స అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఏప్రిల్ 1 నుంచి 30వ తేదీ వరకు కొత్త మార్గదర్శకాలు అమలు చేయాలన్నారు. కంటైన్ మెంట్ జోన్లను త్వరగా గుర్తించాలని, ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్యను […]
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంపై కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. టెస్ట్, ట్రాక్, ట్రీట్ విధానాన్ని వేగవంతం చేయాలని ఆదేశించింది. కోవిడ్ నిబంధనలు మరింత కఠినతరం చేయాలని సూచించింది. పాజిటివ్ వచ్చిన వారిని ఐసోలేట్ చేసి చికిత్స అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఏప్రిల్ 1 నుంచి 30వ తేదీ వరకు కొత్త మార్గదర్శకాలు అమలు చేయాలన్నారు. కంటైన్ మెంట్ జోన్లను త్వరగా గుర్తించాలని, ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్యను వేగవంతం చేయాలన్నారు. కంటైన్ మెంట్ జోన్లలో కఠిన నిర్ణయాలు తీసుకునే బాధ్యతను కేంద్రం కలెక్టర్ల మీదే పెట్టింది. ప్రయాణాలు, సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్, రద్దీ ఏరియాల్లో రద్దీని తగ్గించేందుకు రాష్ట్రాలు స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకోవచ్చునని నూతన మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి.