షాక్ కొట్ట నున్న విద్యుత్.. కేంద్రం కొత్త పాలసీ

దిశ, తెలంగాణ బ్యూరో : సాంకేతిక, వాణిజ్య నష్టాలు 15 శాతం కంటే ఎక్కువగా ఉంటే ప్రీపెయిడ్ మీటర్లు ఏర్పాటు చేయాల్సిందేనని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్ అధికారులను ఆదేశించారు. ఫోరమ్ ఆఫ్ రెగ్యులేటర్స్ సమావేశంలో ఆయన పలు అంశాలను వెల్లడించారు. రాష్ట్రాల్లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రీపెయిడ్ మీటర్లు బిగించాలని ఆయన ఆదేశించారు. ఈ ప్రక్రియను డిసెంబర్ 2023 నాటికి పూర్తిచేయాలన్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వాల సమ్మతి అక్కర్లేదని కేంద్ర మంత్రి ఆదేశించారు. […]

Update: 2021-08-26 11:12 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : సాంకేతిక, వాణిజ్య నష్టాలు 15 శాతం కంటే ఎక్కువగా ఉంటే ప్రీపెయిడ్ మీటర్లు ఏర్పాటు చేయాల్సిందేనని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్ అధికారులను ఆదేశించారు. ఫోరమ్ ఆఫ్ రెగ్యులేటర్స్ సమావేశంలో ఆయన పలు అంశాలను వెల్లడించారు. రాష్ట్రాల్లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రీపెయిడ్ మీటర్లు బిగించాలని ఆయన ఆదేశించారు. ఈ ప్రక్రియను డిసెంబర్ 2023 నాటికి పూర్తిచేయాలన్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వాల సమ్మతి అక్కర్లేదని కేంద్ర మంత్రి ఆదేశించారు. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరనీ కమిషన్లు తక్షణ ప్రాతిపదికన పనులు చేపట్టాలని డిస్కమ్‌లకు ఆదేశించాలని సూచించారు.

స్మార్ట్ మీటర్ల ఏర్పాటును నిర్ణీత గడువులోగా పూర్తి చేయకపోతే కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు అందవని స్పష్టం చేశారు. టీఎస్ ఎన్పీడీసీఎల్, సిరిసిల్ల వంటి ప్రాంతాల్లో సాంకేతిక, వాణిజ్య నష్టాలు 35 నుంచి 40 శాతం వరకు ఉన్నందున ఈ ప్రాంతాల్లో స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు తెలంగాణ రెగ్యులేటరీ కమిషన్ త్వరలోనే ఆదేశాలు జారీ చేయనుందన్నారు. వినియోగదారులపై ఎలాంటి భారం పడకూడదని, ఇకపై అన్ని కొత్త కనెక్షన్లు స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లే ఉండాలన్నారు.

Tags:    

Similar News