స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గం : కేంద్రం
దిశ, ఏపీ బ్యూరో : విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై వెనక్కి తగ్గేదిలేదని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ప్రైవేటీకరణకు సంబంధించి ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనట్లు పేర్కొంది. ప్రైవేటీకరణను నిరసిస్తూ విశాఖ ఉక్కు పోరాట కమిటీ నేతృత్వంలో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఉక్కు కార్మికులు మహాధర్నా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పార్లమెంట్‌లో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఎంపీ సజ్దా అహ్మద్ కేంద్రాన్ని ప్రశ్నించారు. ఎంపీ సజ్దాతోపాటు మరో ఇద్దరు ఎంపీలు […]
దిశ, ఏపీ బ్యూరో : విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై వెనక్కి తగ్గేదిలేదని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ప్రైవేటీకరణకు సంబంధించి ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనట్లు పేర్కొంది. ప్రైవేటీకరణను నిరసిస్తూ విశాఖ ఉక్కు పోరాట కమిటీ నేతృత్వంలో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఉక్కు కార్మికులు మహాధర్నా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా పార్లమెంట్‌లో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఎంపీ సజ్దా అహ్మద్ కేంద్రాన్ని ప్రశ్నించారు. ఎంపీ సజ్దాతోపాటు మరో ఇద్దరు ఎంపీలు కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించారు. ఎంపీల ప్రశ్నలకు కేంద్రం లిఖితపూర్వకంగా సమాధానమిచ్చింది. ప్రైవేటీకరణకు సంబంధించి ప్రక్రియ ప్రారంభమైందని.. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేదేలేదని క్లారిటీ ఇచ్చింది. అయితే ప్రస్తుతం స్టీల్ ప్లాంట్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు, భాగస్వాముల సమస్యలను పరిష్కరించడంపై దృష్టి కేంద్రీకరించినట్లు కేంద్రం తెలిపింది.