తెలంగాణకు ప్రత్యేక నిధులు నిల్
దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించిన దాఖలాలేవీ లేవు. రాష్ట్ర ప్రతిపాదిత ప్రాజెక్టుల ఊసే కనిపించలేదు. ప్రధానంగా ముచ్చర్ల ఫార్మా సిటీ, నిమ్జ్‌లకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని మంత్రి కేటీ రామారావు లేఖలు రాశారు. అలాగే ఐటీఐఆర్ ప్రాజెక్టును అమలు చేసేందుకు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కేంద్ర ఐటీ మంత్రికి ప్రత్యేకంగా మొర పెట్టుకున్నారు. ఇలాంటివేవీ కేంద్ర బడ్జెట్‌లో పొందుపర్చలేదు. దేశవ్యాప్తంగా పారిశ్రామిక రంగానికి జవసత్వాలు నింపేందుకు స్కిల్డెవలప్మెంట్ప్రాజెక్టు మినహా […]
దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించిన దాఖలాలేవీ లేవు. రాష్ట్ర ప్రతిపాదిత ప్రాజెక్టుల ఊసే కనిపించలేదు. ప్రధానంగా ముచ్చర్ల ఫార్మా సిటీ, నిమ్జ్‌లకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని మంత్రి కేటీ రామారావు లేఖలు రాశారు. అలాగే ఐటీఐఆర్ ప్రాజెక్టును అమలు చేసేందుకు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కేంద్ర ఐటీ మంత్రికి ప్రత్యేకంగా మొర పెట్టుకున్నారు. ఇలాంటివేవీ కేంద్ర బడ్జెట్‌లో పొందుపర్చలేదు.
దేశవ్యాప్తంగా పారిశ్రామిక రంగానికి జవసత్వాలు నింపేందుకు స్కిల్డెవలప్మెంట్ప్రాజెక్టు మినహా మరే ఇతర కొత్త అంశాలు కనిపించ లేదు. కాకపోతే చిన్న పరిశ్రమల నిర్వచనంలో మార్పు తీసుకొచ్చారు. రూ.50 లక్షల నుంచి రూ.2 కోట్ల పెట్టుబడి పరిమితి వరకూ చిన్న సంస్థలుగా పరిగణించనున్నారు. కొత్త ప్రాజెక్టుల కోసం ప్రస్తుత ప్రాజెక్టుల్లో పెట్టుబడుల ఉపసంహరణ తప్పనిసరి. రూ.5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం చేరాలంటే రెండంకెల వృద్ధి తప్పనిసరి అని పేర్కొన్నారు. స్టార్టప్‌లకు చేయూత కోసం ఏకసభ్య కంపెనీలకు మరింత ఊతమివ్వనున్నట్లు ప్రకటించారు. కంపెనీలు ఒక వ్యాపారం నుంచి మరో వ్యాపారానికి మారే సమయాన్ని 180 నుంచి 120 రోజులకు కుదించారు.
పరిశ్రమల శాఖకు రూ.12,768 కోట్లు
పరిశ్రమల శాఖకు రూ.12,768 కోట్లు కేటాయించారు. ఇందులో రెవెన్యూ రూ.11,269 కోట్లు కాగా, మూలధనం రూ.1,498 కోట్లుగా పేర్కొన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్‌కు రూ.1,308 కోట్లు, స్కిల్ డెవలప్మెంట్అండ్ఎంటర్ప్రెన్యూర్షిప్కు రూ.2,785 కోట్లు, టెక్స్‌టైల్ శాఖకు రూ.3,631 కోట్లు కేటాయించారు. ఎంఎస్ఎంఈ రంగానికి రూ.15,700 కోట్లు కేటాయించారు. గతేడాది కంటే ఈ మొత్తం డబుల్. ఎంఎస్ఎంఈ రంగాభివృద్ధికి మద్దతు తెలిపింది. మరిన్ని పరిశ్రమలను ఆకర్షించేందుకు మెగా స్కీంను ప్రకటించారు. త్వరలోనే మెగా ఇండస్ట్రియల్ టెక్స్‌టైల్ పార్కు, వచ్చే మూడేండ్లలో ఏడు టెక్స్‌టైల్ పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అవి ఎక్కడెక్కడో స్పష్టత లభించలేదు. రాష్ట్ర ప్రభుత్వం వరంగల్‌లో ప్రతిపాదించిన మెగా కాకతీయ టెక్స్‌టైల్‌పార్కు ఊసైతే లేదు. రియల్ఎస్టేట్ రంగంలో మాత్రం కొత్తగా రెంటల్హౌజింగ్ప్రతిపాదనను తీసుకొచ్చారు. అలాగే ప్రభుత్వ రంగ సంస్థల భూములను సద్వినియోగం చేసేందుకు వ్యూహరచన చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు ప్రకటించారు. దీని ద్వారా రియల్ఎస్టేట్ రంగానికి ఊతం లభించనుంది.
రెంటల్ హౌజింగ్‌పై ఆశలు
కేంద్ర బడ్జెట్బాగుంది. ఎఫర్డబుల్ హౌజింగ్రుణాలపై మరో ఏడాది గడువు పెంచింది. అలాగే మేం రెంటల్హౌజింగ్పై రాయితీలు అడిగాం. దానికి నోటిఫైడ్చేస్తామన్నారు. ఇక్కడ ఇవి పాపులర్ కాలేదు. కానీ యూఎస్‌లో హై నెట్‌వర్క్ ఉన్నోళ్లు రెంటల్ ఇన్వెస్టింగ్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు వస్తున్నారు. వాళ్లకు ఆ ఇండ్లు ఎక్కడున్నాయో కూడా తెలియదు. కానీ జేఎల్‌ఎల్ వంటి సంస్థలు రెంటల్ వ్యవహారాన్ని నడుపుతున్నాయి. ఎఫర్డబుల్రెంటల్హౌజింగ్పై కేంద్రం దృష్టి పెట్టింది. అదే సంతోషకరమైన అంశం. అలాగే ప్రభుత్వ భూములను మానిటైజ్ చేస్తామని ప్రకటించింది. ఎస్‌యూవీ యుటిలైజ్ చేసేందుకు ముందుకొచ్చింది. ప్రభుత్వ భూములను సద్వినియోగం చేసేందుకు ఎల్‌ఐజీ, ఎంఐజీ గృహ సముదాయాలు కల్పించాలని మేం సూచించాం. అమ్మడం కంటే యూఎస్ తరహా రెంటల్ హౌజింగ్ప్రాజెక్టులను చేపట్టాలి. ప్రభుత్వ రంగ సంస్థల భూముల్లోనూ జేఎన్ఎన్యూఆర్ఎం వంటి పథకాల నిధులతో నిర్మాణ ప్రాజెక్టులు చేపట్టడం వల్ల అందరికీ ఇంటి వసతి లభించేందుకు అవకాశం ఉంటుంది. బడ్జెట్‌లో స్కిల్ డెవలప్‌మెంట్‌కు, హెల్త్ కేర్ రంగాలకు అధిక నిధులు కేటాయించడం వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. – శేఖర్‌రెడ్డి, మాజీ జాతీయ అధ్యక్షుడు, క్రెడాయ్
వెసులుబాటు కల్పిస్తారనుకున్నాం
కేంద్ర బడ్జెట్‌లో పన్నులు పెంచలేదు. అదొక్కటే సంతోషకరమైన అంశం. కొవిడ్‌నుంచి కోలుకునేందుకు ఆత్మనిర్భర భారత్ప్రాజెక్టును ప్రవేశపెట్టారు. అది బ్యాంకర్ల అడ్డగోలు నిర్ణయాలు, నిర్లక్ష్యం వల్ల ప్రయోజనం నెరవేరలేదు. ఈ ఏడాది బడ్జెట్‌లో అలాంటిదే ప్రకటిస్తారని ఆశించాం. కానీ ఆ ఊసే లేదు. గతేడాది మొదటి, రెండో క్వార్టర్‌లో కరెంటు బిల్లులే కట్టలేని దుస్థితి నెలకొంది. ఎంతో ఇబ్బంది పడ్డాం. సపోర్టింగ్ సిస్టం లేదు. మారటోరియం కూడా ఆర్నెళ్లకే పరిమితం చేశారు. మరో ఆర్నెళ్లు పొడిగిస్తారని ఎదురుచూశాం. కనీసం వడ్డీ రద్దు ప్రకటన వస్తుందనుకున్నాం. అదీ లేదు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాల అమలుకు బ్యాంకర్లు సహకరించడం లేదు. అందుకే ఎవరికీ సాయం అందడం లేదు.
– వెన్నం అనిల్‌రెడ్డి, సౌతిండియా ఉపాధ్యక్షుడు, నేషనల్ప్లాస్టిక్ మాన్యుఫ్యాక్చరింగ్ అసోసియేషన్
రెండేండ్లు ఎన్పీఏ సస్పెండ్ చేయాలి
కేంద్ర ప్రభుత్వ కేటాయింపులు ఆశాజనకంగా ఉన్నాయి. కానీ కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ తర్వాత ఆత్మనిర్భర భారత్కింద ఊతం ఇచ్చేందుకు కేంద్రం ప్రాజెక్టు అమలు చేసింది. కానీ మానిటరింగ్ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వల్ల ప్రయోజనం నెరవేరలేదు. ఏ బ్యాంకు సహకరించలేదు. బ్యాంకులు డేటాను ఎస్‌ఎల్‌బీసీకి సరిగ్గా ఇవ్వలేదు. అలాగే ఆర్బీఐకి ఎస్ఎల్బీసీ ఇవ్వలేకపోయింది. ఈ కారణంతో ప్రాజెక్టు కింద లబ్ధి పొందడం కష్టంగా మారింది. కేంద్రం ప్రవేశపెట్టిన ప్రాజెక్టులను అమలు చేయని బ్యాంకులపై ఆర్బీఐ క్రమశిక్షణా చర్యలు తీసుకునే అధికారమే లేకుండాపోయింది. ఆయా బ్యాంకులను బ్లాక్‌లిస్టులో పెట్టాలి. అప్పుడే ప్రాజెక్టులు అమలవుతాయి. ఎన్పీఏలను మరో రెండేండ్ల పాటు సస్పెండ్చేయాలి. అప్పుడే పరిశ్రమలన్నీ రివైవ్అవుతాయి. ఉన్న పరిశ్రమలు మూతపడకుండా కాపాడుకోవాలి.
– ఏపీకే రెడ్డి, జాతీయ అధ్యక్షుడు, ఫెడరేషన్ ఆఫ్ స్మాల్అండ్మీడియం ఎంటర్‌ప్రైజస్ ఆఫ్ ఇండియా