ఆ కేసులన్నీ ఎత్తివేత.. కేంద్రం కీలక నిర్ణయం
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సెక్షన్ 66-ఏ ఐటీ చట్టం కింద నమోదైన కేసులు ఎత్తివేసింది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సెక్షన్ 66ఏ కింద కొత్తగా కేసులు నమోదు చేయవద్దని ఆదేశించింది. రద్దు చేసినా కొన్ని రాష్ట్రాలు ఈ చట్టంపై సుప్రీంకోర్టుకు వెళ్లడంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ చట్టాన్ని నాలుగేళ్ల క్రితమే రద్దు చేయగా.. రాష్ట్ర ప్రభుత్వాలు […]
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సెక్షన్ 66-ఏ ఐటీ చట్టం కింద నమోదైన కేసులు ఎత్తివేసింది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సెక్షన్ 66ఏ కింద కొత్తగా కేసులు నమోదు చేయవద్దని ఆదేశించింది. రద్దు చేసినా కొన్ని రాష్ట్రాలు ఈ చట్టంపై సుప్రీంకోర్టుకు వెళ్లడంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ చట్టాన్ని నాలుగేళ్ల క్రితమే రద్దు చేయగా.. రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదు. దీంతో తాజాగా మళ్లీ ఆదేశాలు జారీ చేసింది. కాగా ఈ సెక్షన్ కింద దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో 740కిపైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.