పాత రూ.100నోట్ల రద్దుపై స్పందించిన కేంద్రం

దిశ,వెబ్‌డెస్క్: గతకొద్దిరోజులుగా పాత రూ.100నోట్లు,రూ.10,రూ.5నోట్లు రద్దు కాబోతున్నాయని, వాటిని ఉపసంహరించుకోవాలని ఆర్బీఐ చెప్పిందంటూ ప్రచారం జరిగింది. ఆ ప్రచారంపై కేంద్రం స్పందించింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) ద్వారా తమ వద్ద ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని కొట్టిపారేసింది. కొద్దిరోజుల క్రితం ఏప్రిల్ నాటికి పాత రూ.100నోట్ల చెలామణి నుంచి తప్పించాలని ఆర్బీఐ యోచిస్తున్నట్టు డిస్ట్రిక్ట్ లెవల్ సెక్యూరిటీ కమిటీ(DLSC), డిస్ట్రిక్ట లెవల్ కరెన్సీ మేనేజ్మెంట్ కమిటీ(DLMC) సమావేశంలో ఆర్బీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్(AGM) చెప్పారని కథనాలు వెలుగులోకి వచ్చాయి. […]

Update: 2021-01-25 02:47 GMT

దిశ,వెబ్‌డెస్క్: గతకొద్దిరోజులుగా పాత రూ.100నోట్లు,రూ.10,రూ.5నోట్లు రద్దు కాబోతున్నాయని, వాటిని ఉపసంహరించుకోవాలని ఆర్బీఐ చెప్పిందంటూ ప్రచారం జరిగింది. ఆ ప్రచారంపై కేంద్రం స్పందించింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) ద్వారా తమ వద్ద ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని కొట్టిపారేసింది. కొద్దిరోజుల క్రితం ఏప్రిల్ నాటికి పాత రూ.100నోట్ల చెలామణి నుంచి తప్పించాలని ఆర్బీఐ యోచిస్తున్నట్టు డిస్ట్రిక్ట్ లెవల్ సెక్యూరిటీ కమిటీ(DLSC), డిస్ట్రిక్ట లెవల్ కరెన్సీ మేనేజ్మెంట్ కమిటీ(DLMC) సమావేశంలో ఆర్బీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్(AGM) చెప్పారని కథనాలు వెలుగులోకి వచ్చాయి. అయితే తాజాగా కేంద్రం నిర్ణయంతో ఆందోళన ఉన్న దేశప్రజలకు ఊరట కలిగించినట్లైంది.

Tags:    

Similar News