కేంద్ర మానవ వనరుల శాఖ పేరు మార్పు

దిశ, వెబ్ డెస్క్: ప్రధాని మోదీ అధ్యక్షత జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో సరికొత్త విద్యా విధానానికి ఆమోదం తెలిపారు. ప్రస్తుతం ఉన్న కేంద్ర మానవ వనరుల శాఖను విద్యాశాఖగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇస్రో మాజీ చీఫ్ కస్తూరీరంగన్ కమిటీ సిఫార్సుల ప్రకారం ఈ కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలో విద్యావ్యవస్థ కొత్త పుంతలు తొక్కడానికి ఈ చర్య దోహదపడుతుందని విద్యారంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా, 1985లో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ నేతృత్వంలోని […]

Update: 2020-07-29 05:55 GMT

దిశ, వెబ్ డెస్క్: ప్రధాని మోదీ అధ్యక్షత జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో సరికొత్త విద్యా విధానానికి ఆమోదం తెలిపారు. ప్రస్తుతం ఉన్న కేంద్ర మానవ వనరుల శాఖను విద్యాశాఖగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇస్రో మాజీ చీఫ్ కస్తూరీరంగన్ కమిటీ సిఫార్సుల ప్రకారం ఈ కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలో విద్యావ్యవస్థ కొత్త పుంతలు తొక్కడానికి ఈ చర్య దోహదపడుతుందని విద్యారంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా, 1985లో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం విద్యాశాఖను మానవ వనరుల శాఖగా మారుస్తూ ఉత్తర్వులు వెల్లడించిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News