కక్కుర్తి.. శ్మశాన వాటికనూ వదల్లేదు

దిశ, మానకొండూరు : శ్మశాన వాటిక నిర్మాణ దశలోనే స్లాబ్ కూలిపోయిన ఘటన మానకొండూరు మండలం వేగురుపల్లిలో వెలుగుచూసింది. గ్రామంలో రూ.12 లక్షలతో నిర్మిస్తున్న ఈ శ్మశాన వాటిక కోసం శుక్రవారం స్లాబ్ వేశారు. మరుసటి రోజు(శనివారం) స్లాబ్ కూలి కిందపడిపోయింది. నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. స్లాబ్ కోసం ఉపయోగించిన కాంక్రీట్ నిబంధనల ప్రకారం మెటీరియల్ మిక్స్ చేయకపోవడం వల్లే కూలిపోయిందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. శ్మశాన వాటిక నిర్మాణం పూర్తయిన […]

Update: 2021-04-04 08:31 GMT

దిశ, మానకొండూరు : శ్మశాన వాటిక నిర్మాణ దశలోనే స్లాబ్ కూలిపోయిన ఘటన మానకొండూరు మండలం వేగురుపల్లిలో వెలుగుచూసింది. గ్రామంలో రూ.12 లక్షలతో నిర్మిస్తున్న ఈ శ్మశాన వాటిక కోసం శుక్రవారం స్లాబ్ వేశారు. మరుసటి రోజు(శనివారం) స్లాబ్ కూలి కిందపడిపోయింది. నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని స్థానికులు చెబుతున్నారు.

స్లాబ్ కోసం ఉపయోగించిన కాంక్రీట్ నిబంధనల ప్రకారం మెటీరియల్ మిక్స్ చేయకపోవడం వల్లే కూలిపోయిందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. శ్మశాన వాటిక నిర్మాణం పూర్తయిన తర్వాత దహన సంస్కారాలకు వెళ్లినప్పుడు కూలితే ఎలాంటి నష్టం వాటిల్లేదో అర్థం చేసుకోవాలన్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రత్యేక దృష్టి సారించి శ్మశాన వాటిక నిర్మాణం విషయంలో ప్రత్యేక చొరవ చూపించాలని కోరుతున్నారు.

Tags:    

Similar News