దేశం విలువైన వజ్రాన్ని కోల్పోయింది : చిరు
దిశ, వెబ్‌డెస్క్: ప్రణబ్ ముఖర్జీ మరణంతో దేశం ఒక విలువైన వజ్రాన్ని కోల్పోయిందన్నారు చిరంజీవి. ఆయన ఇక లేరన్న విషయంతో తీవ్ర మనస్తాపానికి గురైన చిరు.. ‘మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతాం సార్’ అని తెలిపారు. ప్రణబ్ ముఖర్జీతో జరిగిన సంభాషణను ఒక నిధిగా గుర్తుంచుకుంటానని అన్నారు. గొప్పజ్ఞాని, విశిష్టమైన రాజకీయ జీవితాన్ని సాధించిన వ్యక్తిగా కొనియాడారు. మీ మనస్సు ప్రశాంతంగా ఉండాలి మిత్రమా.. అని కోరుకున్నారు. Deeply saddened by the demise of Shri […]
దిశ, వెబ్‌డెస్క్: ప్రణబ్ ముఖర్జీ మరణంతో దేశం ఒక విలువైన వజ్రాన్ని కోల్పోయిందన్నారు చిరంజీవి. ఆయన ఇక లేరన్న విషయంతో తీవ్ర మనస్తాపానికి గురైన చిరు.. ‘మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతాం సార్’ అని తెలిపారు. ప్రణబ్ ముఖర్జీతో జరిగిన సంభాషణను ఒక నిధిగా గుర్తుంచుకుంటానని అన్నారు. గొప్పజ్ఞాని, విశిష్టమైన రాజకీయ జీవితాన్ని సాధించిన వ్యక్తిగా కొనియాడారు. మీ మనస్సు ప్రశాంతంగా ఉండాలి మిత్రమా.. అని కోరుకున్నారు.
Deeply saddened by the demise of Shri #PranabMukherjee Will always treasure & cherish my interactions with him..An accomplished man of great wisdom & an illustrious political career..Will miss you Sir..The country has lost a precious diamond today…Rest in peace Dear Pranab Da!
— Chiranjeevi Konidela (@KChiruTweets) August 31, 2020
ప్రణబ్ జీ సేవలను తరతరాలు గుర్తుంచుకుంటాయని తెలిపారు మోహన్ బాబు. ఆయన కుటుంబానికి హృదయ పూర్వక సంతాపం తెలిపారు.
Generations will always remember the contributions of Shri.Pranab Ji . Heartfelt Condolences to his family. #PranabMukherjee
— Mohan Babu M (@themohanbabu) August 31, 2020
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారి మరణం ఆవేదనకు గురి చేసిందన్నారు మహేశ్ బాబు. అత్యంత మేధోసంపత్తి కలిగిన, స్ఫూర్తిని పంచే రాజకీయ నాయకులు ప్రణబ్‌కు భారత జాతి సంతాపం తెలుపుతుందని అన్నారు. ఆయన కుటుంబానికి భగవంతుడు మరింత శక్తిని ఇవ్వాలని కోరుకున్నారు.
Saddened to hear about the demise of our former President Shri Pranab Mukherjee. The nation mourns one of its most intellectual and inspiring leaders. Heartfelt condolences to the family and loved ones in this hour of grief. 🙏
— Mahesh Babu (@urstrulyMahesh) August 31, 2020