హుజురాబాద్ టీఆర్ఎస్ కార్యాలయంలో సంబరాలు..
దిశ, హుజురాబాద్: దళితుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా హుజురాబాద్ పట్టణంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నాయకులు సంబరాలు నిర్వహించారు. అనంతరం బండ శ్రీనివాస్ మాట్లాడుతూ.. దళిత బంధు పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్ల నిధులు విడుదల చేసిందన్నారు. సీఎం కేసీఆర్‌కు దళితులంత రుణపడి ఉంటారన్నారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. […]
దిశ, హుజురాబాద్: దళితుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా హుజురాబాద్ పట్టణంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నాయకులు సంబరాలు నిర్వహించారు. అనంతరం బండ శ్రీనివాస్ మాట్లాడుతూ.. దళిత బంధు పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్ల నిధులు విడుదల చేసిందన్నారు.
సీఎం కేసీఆర్‌కు దళితులంత రుణపడి ఉంటారన్నారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. ఈ నెల 16న హుజురాబాద్ లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా మంజూరు పత్రాలు అందజేస్తారన్నారు. మొదటి విడుతగా మంజూరైన రూ.500 కోట్లు అర్హులైన వారికి అందజేస్తారన్నారు.