Breaking : చైల్డ్ పోర్నోగ్రఫీ రాకెట్‌పై CBI సీరియస్.. దేశవ్యాప్తంగా 76 ప్రాంతాల్లో సోదాలు

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో రోజురోజుకూ చిన్నారులపై లైంగిక దాడులు పెరిగిపోవడాన్ని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) సీరియస్‌గా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో చిన్నారుల కిడ్నాప్, లైంగిక దాడులు, గ్యాంగ్ రేప్స్, హత్యాచారాలపై దృష్టి సారించిన కేంద్ర దర్యాప్తు సంస్థ దీనంతటికి చైల్డ్ పోర్నో గ్రఫీనే మూల కారణంగా గుర్తించినట్టు తెలుస్తోంది. ఆన్‌లైన్ ద్వారా చైల్డ్ పోర్నో గ్రఫీని ఎంకరేజ్ చేస్తున్న వారిపై ఫోకస్ పెట్టినట్టు సమాచారం. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా 76 ప్రాంతాలు, […]

Update: 2021-11-16 02:51 GMT

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో రోజురోజుకూ చిన్నారులపై లైంగిక దాడులు పెరిగిపోవడాన్ని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) సీరియస్‌గా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో చిన్నారుల కిడ్నాప్, లైంగిక దాడులు, గ్యాంగ్ రేప్స్, హత్యాచారాలపై దృష్టి సారించిన కేంద్ర దర్యాప్తు సంస్థ దీనంతటికి చైల్డ్ పోర్నో గ్రఫీనే మూల కారణంగా గుర్తించినట్టు తెలుస్తోంది.

ఆన్‌లైన్ ద్వారా చైల్డ్ పోర్నో గ్రఫీని ఎంకరేజ్ చేస్తున్న వారిపై ఫోకస్ పెట్టినట్టు సమాచారం. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా 76 ప్రాంతాలు, 14 రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నట్టు తెలిసింది. ఈ విషయంలో ఇప్పటికే 23 కేసులు నమోదు చేసిన సీబీఐ, 86 మంది అనుమానితులపై అభియోగం మోపింది. ఆన్‌లైన్ మాద్యమాల ద్వారా చైల్డ్ పోర్న్ కంటెంట్ వ్యాప్తి చేస్తున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోనున్నట్టు ప్రకటించింది.

Tags:    

Similar News