వివేకా హత్య కేసులో 15 మంది అనుమానితులు

దిశ, వెబ్‌డెస్క్: మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ ముమ్మరం చేస్తోంది. ఇప్పటికే వివేకా ఇంటికెళ్లి సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసిన సీబీఐ పలువురిని విచారించింది. తొలుత విచారణ జరిపిన సిట్.. మూడు సంచుల్లో నివేదికలను సీబీఐకి అప్పగించింది. దీంతో మొత్తం 15 మంది అనుమానితుల జాబితను సీబీఐ అధికారులు సిద్ధం చేశారు. వీరిని కడప పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో విచారించేందకు నిర్ణయం తీసుకుంది. సీబీఐ సేకరించిన అనుమానిత జాబితాలో టీడీపీ ఎమ్మెల్సీ […]

Update: 2020-07-27 11:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ ముమ్మరం చేస్తోంది. ఇప్పటికే వివేకా ఇంటికెళ్లి సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసిన సీబీఐ పలువురిని విచారించింది. తొలుత విచారణ జరిపిన సిట్.. మూడు సంచుల్లో నివేదికలను సీబీఐకి అప్పగించింది. దీంతో మొత్తం 15 మంది అనుమానితుల జాబితను సీబీఐ అధికారులు సిద్ధం చేశారు.

వీరిని కడప పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో విచారించేందకు నిర్ణయం తీసుకుంది. సీబీఐ సేకరించిన అనుమానిత జాబితాలో టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, వైఎస్ అవినాశ్ రెడ్డి, తండ్రి భాస్కర్ రెడ్డి, చిన్నాన మనోహ రెడ్డి పేర్లు ఉన్నట్లు సమాచారం. వీరికి నోటీసులు ఇచ్చి విచారణ పిలువనున్నట్లు సీబీఐ అధికారులు భావిస్తున్నారు.

Tags:    

Similar News