మణికంఠా రెడ్డి అరెస్ట్.. వైఎస్ వివేకా హత్య కేసులో ఏమి జరిగింది ?

దిశ, ఏపీ బ్యూరో: మాజీమంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో ట్విస్ట్ నెలకొంది. సీబీఐ కేసు విచారిస్తున్న తరుణంలో తమ ప్రాణాలకు ముప్పు ఉందని ఆయ‌న‌ కుమార్తె సునీతారెడ్డి డీజీపీ, సీబీఐ, కడప జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఓ వ్యక్తి త‌మ ఇంటి ముందు రెక్కీ నిర్వహించాడని ఆరోపిస్తూ లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. ఈ నెల 10న‌ ఆ అనుమానితుడు త‌మ‌ ఇంటి చుట్టూ తిరిగాడ‌ని, ఫోన్ కాల్స్ కూడా చేశాడని సునీత‌ారెడ్డి ఫిర్యాదులో […]

Update: 2021-08-14 11:31 GMT

దిశ, ఏపీ బ్యూరో: మాజీమంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో ట్విస్ట్ నెలకొంది. సీబీఐ కేసు విచారిస్తున్న తరుణంలో తమ ప్రాణాలకు ముప్పు ఉందని ఆయ‌న‌ కుమార్తె సునీతారెడ్డి డీజీపీ, సీబీఐ, కడప జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఓ వ్యక్తి త‌మ ఇంటి ముందు రెక్కీ నిర్వహించాడని ఆరోపిస్తూ లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. ఈ నెల 10న‌ ఆ అనుమానితుడు త‌మ‌ ఇంటి చుట్టూ తిరిగాడ‌ని, ఫోన్ కాల్స్ కూడా చేశాడని సునీత‌ారెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. అందుకు సంబంధించి సీసీ ఫుటేజ్‌ను కూడా పోలీసులకు అందజేశారు. దీంతో పులివెందుల డీఎస్పీ శ్రీనివాసులు నిందితుడు మణికంఠారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.

రెక్కీ నిర్వహించడానికి గల కారణాలు..ఫోన్లు ఎవరెవరికి చేశారు అన్నదానిపై ఆరా తీస్తున్నారు. మరోవైపు 69వ రోజు సీబీఐ విచారణ చేపట్టింది. కడప, పులివెందులలో సీబీఐ బృందాలు నలుగురు అనుమానితులను విచారించాయి. తుమ్మలపల్లి కర్మాగారంలో పనిచేసే ఉద్యోగి ఉదయ్ కుమార్‌రెడ్డి, ఆయన తండ్రి ప్రకాశ్‌రెడ్డిని సీబీఐ అధికారులు విచారించారు. అలాగే వీరి ఇంటివద్ద ఉండే బాబురెడ్డి దంపతులను కూడా సీబీఐ విచారించింది. ఉదయ్‌ కుమార్‌రెడ్డి ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడు కాగా ప్రకాశ్‌రెడ్డి ఈసీ గంగిరెడ్డికి అత్యంత సన్నిహితుడని తెలుస్తోంది. సీబీఐ కస్టడీలో ఉన్న సునీల్‌కుమార్ యాదవ్‌‌తోపాటు అతడి సమీప బంధువు భరత్‌కుమార్ యాదవ్‌ను సైతం సీబీఐ విచారించింది.

 

 

Tags:    

Similar News