వివేకా హత్యకేసు : ఎర్రగంగిరెడ్డిని ప్రశ్నిస్తున్న సీబీఐ
దిశ, ఏపీ బ్యూరో: దివంగత మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ వేగవంతం చేసింది. కడప సెంట్రల్ జైలు గెస్ట్‌హౌస్‌లో అనుమానితులను గత కొన్నిరోజులుగా సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. శనివారం వైఎస్ వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డిని విచారిస్తున్నారు. వరుసగా మూడోరోజులుగా గంగిరెడ్డిని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. 2019 మార్చి 15న వివేకా హత్య జరిగిన విషయం తెలిసిందే. అయితే హత్య జరిగిన రోజు ఆయన ఇంట్లో సాక్ష్యాలు తారుమారు చేశారనే అభియోగాలపై […]
దిశ, ఏపీ బ్యూరో: దివంగత మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ వేగవంతం చేసింది. కడప సెంట్రల్ జైలు గెస్ట్‌హౌస్‌లో అనుమానితులను గత కొన్నిరోజులుగా సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. శనివారం వైఎస్ వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డిని విచారిస్తున్నారు. వరుసగా మూడోరోజులుగా గంగిరెడ్డిని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. 2019 మార్చి 15న వివేకా హత్య జరిగిన విషయం తెలిసిందే. అయితే హత్య జరిగిన రోజు ఆయన ఇంట్లో సాక్ష్యాలు తారుమారు చేశారనే అభియోగాలపై రెండేళ్ల కిందటే సిట్ అధికారులు ఎర్ర గంగిరెడ్డిని అరెస్టు చేశారు.
అంతేకాదు గంగిరెడ్డిని గుజరాత్ తీసుకెళ్లి నార్కో అనాలసిస్ పరీక్షలు సైతం చేయించారు. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న ఎర్ర గంగిరెడ్డిని సీబీఐ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు. వివేకాకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, ఆస్తులు, రాజకీయ పరమైన సమస్యలపై ఆరా తీస్తుున్నారు. అలాగే హత్య జరిగిన రోజు గదిలో సాక్ష్యాధారాలు ఎందుకు చెరిపేయాల్సి వచ్చిందనే కోణంలో ప్రశ్నిస్తున్నారు. అలాగే వివేకాకు ఎర్రగంగిరెడ్డితో ఉన్న సంబంధాలు, ఆర్థిక విషయాలపై ప్రశ్నిల వర్షం కురిపిస్తున్నట్లు తెలుస్తోంది.