వివేకా హత్య కేసు: అనుమానితుల స్టేట్‌మెట్స్‌పై సీబీ‘ఐ’

దిశ, వెబ్ డెస్క్: వైఎస్ వివేకా హత్య కేసు విచారణలో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. పులివెందుల డీఎస్పీ కార్యాలయంలో ఇప్పటికే అనుమానితుల స్టేట్‌మెంట్లను పరిశీలించిన సీబీఐ.. మరికొంత మంది అనుమానితులను విచారించేందుకు సిద్ధమైంది. సిట్ విచారించిన అనుమానితుల విచారణ స్టేట్‌మెంట్స్ సీబీఐ అధికారులు ఆంగ్లంలోకి తర్జుమా చేస్తున్నారు. వివేకా కుమార్తె ఆరోపిస్తున్న 15 మంది స్టేట్‌మెంట్స్‌పై సీబీఐ దృష్టి సారించింది. కాగా, ఇప్పటికే పులివెందులలోని వైఎస్ వివేకా నివాసంలో సీబీఐ అధికారులు విచారణ జరిపారు. ఆయన భార్య […]

Update: 2020-07-22 10:07 GMT

దిశ, వెబ్ డెస్క్: వైఎస్ వివేకా హత్య కేసు విచారణలో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. పులివెందుల డీఎస్పీ కార్యాలయంలో ఇప్పటికే అనుమానితుల స్టేట్‌మెంట్లను పరిశీలించిన సీబీఐ.. మరికొంత మంది అనుమానితులను విచారించేందుకు సిద్ధమైంది. సిట్ విచారించిన అనుమానితుల విచారణ స్టేట్‌మెంట్స్ సీబీఐ అధికారులు ఆంగ్లంలోకి తర్జుమా చేస్తున్నారు. వివేకా కుమార్తె ఆరోపిస్తున్న 15 మంది స్టేట్‌మెంట్స్‌పై సీబీఐ దృష్టి సారించింది. కాగా, ఇప్పటికే పులివెందులలోని వైఎస్ వివేకా నివాసంలో సీబీఐ అధికారులు విచారణ జరిపారు. ఆయన భార్య సౌభాగ్యమ్మ, కూతురు సునీతో 3 గంటలకు పైగా మాట్లాడారు. హత్య జరిగిన బెడ్‌రూమ్, మృతదేహం లభ్యమైన బాత్రూమ్‌లోనూ అధికారులు పరిశీలించారు.

Tags:    

Similar News