మళ్లొచ్చిన క్యాట్‌ఫిష్.. బ్యాన్ విధించిన ‘మహా’సర్కార్

దిశ, వెబ్‌డెస్క్ : ఇదివరకే నిషేధానికి గురైన క్యాట్‌ఫిష్ మళ్లీ తిరిగొచ్చింది. విషయం తెలుసుకున్న మహారాష్ట్ర సర్కార్ ఈ విషయంపై మండిపడటమే కాకుండా, ఆ చేపల పెంపకంపై మరోసారి నిషేధం విధించింది. అక్రమంగా వాటిని పెంచుతున్న నిర్వహకులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకివెళితే.. మహారాష్ట్రలోని థానే జిల్లా తాయి మణుగూర్‌ అటవీ ప్రాంతంలో కొందరు వ్యక్తులు నిషేధిత క్యాట్‌ఫిష్‌లను బ్రీడింగ్ చేస్తున్నారు. బీవండి తాలుకా సబ్ డివిజనల్ ఫారెస్ట్ అధికారి కథనం ప్రకారం.. 150ఎకరాల విస్తీర్ణం గల […]

Update: 2020-11-30 07:57 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఇదివరకే నిషేధానికి గురైన క్యాట్‌ఫిష్ మళ్లీ తిరిగొచ్చింది. విషయం తెలుసుకున్న మహారాష్ట్ర సర్కార్ ఈ విషయంపై మండిపడటమే కాకుండా, ఆ చేపల పెంపకంపై మరోసారి నిషేధం విధించింది. అక్రమంగా వాటిని పెంచుతున్న నిర్వహకులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

వివరాల్లోకివెళితే.. మహారాష్ట్రలోని థానే జిల్లా తాయి మణుగూర్‌ అటవీ ప్రాంతంలో కొందరు వ్యక్తులు నిషేధిత క్యాట్‌ఫిష్‌లను బ్రీడింగ్ చేస్తున్నారు. బీవండి తాలుకా సబ్ డివిజనల్ ఫారెస్ట్ అధికారి కథనం ప్రకారం.. 150ఎకరాల విస్తీర్ణం గల అటవీప్రాంతంలో కొందరు అక్రమార్కులు 125కు పైగా నీటికుంటలను ఏర్పాటు చేసి అందులో క్యాట్ ఫిష్‌ లను పెంచుతున్నారు. వీటి విలువ మార్కెట్లో రూ.100 నుంచి 150లోపే ఉంటుందని ఆయన చెప్పారు. మార్కెట్లో చీప్‌గా దొరుకుతాయని ప్రజలు ఈ చేపలకు అలవాటు పడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. థాయ్ మణుగూరు ప్రాంతంలో వీటిని గుట్టుచప్పుకుండా కాకుండా పెంచడంతో పాటు విక్రయం జరుగుతుందని తెలియడంతో తాము తనిఖీలు నిర్వహించామన్నారు. ఈ నేపథ్యంలోనే వాటిని కూల్చివేశామన్నారు.

ఇదిలాఉండగా, 2000 సంవత్సరంలో థాయ్ మణుగూరు ప్రాంతంలో ఎకో సిస్టమ్ చెడిపోవడానికి, ప్రజల ఆరోగ్యానికి హానికరంగా మారినందున నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ క్యాట్ ఫిష్ పెంపకం నిషేధం విధించింది. తాజాగా మరోసారి ఇవి పెంపకం వెలుగులోకి రావడంతో మహా సర్కార్ మరోసారి బ్యాన్ విధించడమే కాకుండా నిర్వహకులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

గుండె, డయాబెటిస్ వ్యాధులు..

క్యాట్‌ఫిష్‌లో ఒమెగా ఫ్యాటీ- 3,6 యాడిస్స్ పుష్కలంగా ఉంటాయి. ఫ్యాటీ -3 మానవ శరీరానికి ఎటువంటి హాని చేయదు. కానీ, ఫ్యాటీ -6 యాసిడ్స్ అనేవి కార్డియోవాస్కూలర్ (గుండె, డయాబెటిస్) వంటి వ్యాధులకు కారకాలుగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. మార్కెట్లో తక్కువ ధరకు లభించడం వలన ప్రజల ఆరోగ్యానికి హానికంగా మారుతాయనే ఉద్దేశ్యంతో చాలా రాష్ట్రాలు వీటి వినియోగాన్ని నిషేధించాయి.

Tags:    

Similar News