129 మందిపై కేసు నమోదు చేసిన విజిలెన్స్ అధికారులు

దిశ, నేరేడుచర్ల: అక్రమంగా విద్యుత్ వినియోగానికి పాల్పడుతున్న 129 మందిపై కేసు నమోదైందని పాలకవీడు మండల ఏఈ నరసింహ నాయక్ శుక్రవారం విలేఖర్లకు తెలిపారు. మండల పరిధిలో విజిలెన్స్ అధికారులు, మండల విద్యుత్ అధికారులు ఆధ్వర్యంలో 19 టీములుగా ఏర్పడి మండలంలోని అన్ని గ్రామాలలో దాడులు నిర్వహించారని.. మీటర్ ఉన్నా కూడా ఆ మీటర్ కలెక్షన్ తొలగించి అక్రమంగా విద్యుత్ వాడుతున్న నలుగురిపై, అక్రమంగా విద్యుత్ వినియోగిస్తున్న 42 మందిపై, అనుమతులు పొందకుండా విద్యుత్ వినియోగిస్తున్న ఎనిమిది […]

Update: 2021-10-08 07:45 GMT

దిశ, నేరేడుచర్ల: అక్రమంగా విద్యుత్ వినియోగానికి పాల్పడుతున్న 129 మందిపై కేసు నమోదైందని పాలకవీడు మండల ఏఈ నరసింహ నాయక్ శుక్రవారం విలేఖర్లకు తెలిపారు. మండల పరిధిలో విజిలెన్స్ అధికారులు, మండల విద్యుత్ అధికారులు ఆధ్వర్యంలో 19 టీములుగా ఏర్పడి మండలంలోని అన్ని గ్రామాలలో దాడులు నిర్వహించారని.. మీటర్ ఉన్నా కూడా ఆ మీటర్ కలెక్షన్ తొలగించి అక్రమంగా విద్యుత్ వాడుతున్న నలుగురిపై, అక్రమంగా విద్యుత్ వినియోగిస్తున్న 42 మందిపై, అనుమతులు పొందకుండా విద్యుత్ వినియోగిస్తున్న ఎనిమిది మందిపై, అదేవిధంగా మరో 75 మందిపై కేసు నమోదు అయినట్లు ఆయన తెలిపారు. ఈ దాడుల్లో విజిలెన్స్ డీఈ, ఏడీఈ, 12 మంది ఏఈలు, మండల విద్యుత్ అధికారులు పాల్గొన్నారని ఏఈ తెలిపారు.

Tags:    

Similar News