కప్పావేరియంట్ కలకలం.. ఒకరు మృతి

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా వ్యాప్తి కాస్త తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే. అయితే, కప్పా రకం వైరస్ మాత్రం​కలకలం సృష్టిస్తోంది. గుజరాత్‌లో ఈ వేరియంట్‌తో ఒకేసారి 5 కేసులు నమోదు అయ్యాయి. జామ్​నగర్‌లో 2, పాంచ్​మహల్​జిల్లాలోని గోద్రాలో 2, మెహ్సానాలో ఒక కేసు వెలుగుచూసింది. అయితే, చికిత్స పొందుతూ పాంచ్​మహల్ వాసి మృతిచెందాడు. కప్ప వేరియంట్ విజృంభణ నేపథ్యంలో గోద్రా జిల్లా యంత్రాంగం, అధికారులు అప్రమత్తమయ్యారు. చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలకు హాజరైన కుటుంబ సభ్యుల […]

Update: 2021-07-25 05:09 GMT

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా వ్యాప్తి కాస్త తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే. అయితే, కప్పా రకం వైరస్ మాత్రం​కలకలం సృష్టిస్తోంది. గుజరాత్‌లో ఈ వేరియంట్‌తో ఒకేసారి 5 కేసులు నమోదు అయ్యాయి. జామ్​నగర్‌లో 2, పాంచ్​మహల్​జిల్లాలోని గోద్రాలో 2, మెహ్సానాలో ఒక కేసు వెలుగుచూసింది. అయితే, చికిత్స పొందుతూ పాంచ్​మహల్ వాసి మృతిచెందాడు.

కప్ప వేరియంట్ విజృంభణ నేపథ్యంలో గోద్రా జిల్లా యంత్రాంగం, అధికారులు అప్రమత్తమయ్యారు. చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలకు హాజరైన కుటుంబ సభ్యుల నుంచి నమూనాలు సేకరించారు. వారికి సన్నిహితంగా ఉన్న మరో 50 మంది నుంచి కూడా నమూనాలు సేకరించారు. వీరందరి ఆర్‌టీపీసీఆర్​ శాంపిల్స్​తీసుకుని టెస్టులు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.

Tags:    

Similar News