లాక్‌డౌన్ నిబంధనల ఉల్లంఘన.. కేసులు నమోదు
దిశ, రంగారెడ్డి: కరోనా వ్యాప్తి నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. జీఓ నెంబర్ 45, 46, 60ల ఆధారంగా గురువారం నిబంధనలు బ్రేక్ చేసిన వారిపై శంషాబాద్ రూరల్ పీఎస్‌లో పలు కేసులు నమోదయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం పిల్లోనిగూడ నుంచి రంగా అనే వ్యక్తి తన సొంతూరుకు కల్లు తరలిస్తున్నాడు. పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు అతన్ని పట్టుకున్నారు. రంగా సమాచారం మేరకు రాయన్నగూడకు […]
దిశ, రంగారెడ్డి: కరోనా వ్యాప్తి నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. జీఓ నెంబర్ 45, 46, 60ల ఆధారంగా గురువారం నిబంధనలు బ్రేక్ చేసిన వారిపై శంషాబాద్ రూరల్ పీఎస్‌లో పలు కేసులు నమోదయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం పిల్లోనిగూడ నుంచి రంగా అనే వ్యక్తి తన సొంతూరుకు కల్లు తరలిస్తున్నాడు. పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు అతన్ని పట్టుకున్నారు. రంగా సమాచారం మేరకు రాయన్నగూడకు చెందిన ముగ్గురి ఇళ్లు, కల్తీ కల్లు అమ్ముతున్నపెద్దషాపూర్ నివాసి ఇంటిపై దాడులు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. అదే గ్రామంలో బార్బర్ షాప్ తెరిచి కటింగ్ చేస్తున్న యజమానిపై, కార్పెంటర్ దుకాణం తెరిచిన నర్కూడ గ్రామ నివాసి, తొండుపల్లి గ్రామంలో ఇస్త్రీ షాపు తెరిచిన వ్యక్తిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Tags: lockdown rules break, shamshabad, police station, cases filed