‘ఈటకు ఓటు వేయాలన్న హరీశ్ రావు’ ఇదిగో సాక్ష్యం.. రాజ్ న్యూస్ ఛానెల్‌పై కేసు
దిశ, హుజురాబాద్ రూరల్ : హుజురాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మోడల్ ఈవీఎంలో కారు గుర్తుకు ఓటు వేసి గెల్లు శ్రీనివాస్‌ను గెలిపించాలని మంత్రి హరీష్ రావు చెప్పారు. అయితే, రాజ్‌న్యూస్ ఛానెల్‌లో మాత్రం కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి ఈటల రాజేందర్‌ను గెలిపించాలని తప్పుడు ప్రచారాన్ని ప్రసారం చేశారని టీఆర్ఎస్ కార్యకర్త టేకుల శ్రావణ్ ఫిర్యాదు మేరకు ఆ ఛానెల్‌పై కేసు నమోదు చేసినట్టు పట్టణ సీఐ శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 28న […]
దిశ, హుజురాబాద్ రూరల్ : హుజురాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మోడల్ ఈవీఎంలో కారు గుర్తుకు ఓటు వేసి గెల్లు శ్రీనివాస్‌ను గెలిపించాలని మంత్రి హరీష్ రావు చెప్పారు. అయితే, రాజ్‌న్యూస్ ఛానెల్‌లో మాత్రం కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి ఈటల రాజేందర్‌ను గెలిపించాలని తప్పుడు ప్రచారాన్ని ప్రసారం చేశారని టీఆర్ఎస్ కార్యకర్త టేకుల శ్రావణ్ ఫిర్యాదు మేరకు ఆ ఛానెల్‌పై కేసు నమోదు చేసినట్టు పట్టణ సీఐ శ్రీనివాస్ తెలిపారు.
ఈ నెల 28న ఈటలకు ఓటు వేయమంటున్న హరీష్ రావు ఇదిగో సాక్షం అనే శీర్షికన తప్పుడు ప్రచారం చేసి ఓటర్లలో గందరగోళం సృష్టించడానికి ప్రయత్నించారని.. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు టేకుల శ్రావణ్ తెలిపారు. కాగా, రాజ్‌న్యూస్ ఛానెల్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసి విచారణ జరుపుతున్నట్టు సీఐ తెలిపారు.