భయంతో ఆత్మహత్య.. ఆపై నెగిటివ్
దిశ, వెబ్ డెస్క్: అతను కార్పెంటర్ వర్క్స్ చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఇటీవల కరోనా లక్షణాలు ఉండటంతో కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాడు. ఫలితం రావడానికి ఐదు రోజులు పడుతుందని వైద్యులు తెలిపారు. అయితే తనకు కరోనా వచ్చిందన భయంతో అతను బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే పరీక్షల్లో అతనికి కరోనా నెగిటివ్ వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూలు జిల్లా ఆత్మకూరు పట్ణణంలో షఫి అనే వ్యక్తి కార్నెంటర్ వర్క్స్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి […]
దిశ, వెబ్ డెస్క్: అతను కార్పెంటర్ వర్క్స్ చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఇటీవల కరోనా లక్షణాలు ఉండటంతో కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాడు. ఫలితం రావడానికి ఐదు రోజులు పడుతుందని వైద్యులు తెలిపారు. అయితే తనకు కరోనా వచ్చిందన భయంతో అతను బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే పరీక్షల్లో అతనికి కరోనా నెగిటివ్ వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూలు జిల్లా ఆత్మకూరు పట్ణణంలో షఫి అనే వ్యక్తి కార్నెంటర్ వర్క్స్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి కరోనా లక్షణాలో టెస్ట్ చేయించుకున్నాడు. అయితే ఫలితాలు రాకముందే తనకు కరోనా సోకిందన్న భయంతో ఆత్మకూరులో బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే కరోనా రిపోర్టులో అతనికి నెగిటివ్ వచ్చిందని వైద్య అధికారులు వెల్లడించారు.