దేశాన్ని భయపెడుతున్న గుజరాతీ
గుజరాత్‌కు చెందిన ఒక వ్యక్తి యావద్భారతదేశాన్ని భయాందోళనల్లోకి నెడుతున్నాడు. జనవరి 19న చైనా నుంచి 41 ఏళ్ల వ్యక్తి గుజరాత్ చేరుకున్నాడు. జలుబు జ్వరం వేధిస్తుండడంతో అతనిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. పరీక్షలు చేసిన వైద్యులు అతనికి కరోనా వైరస్ లక్షణాలున్నాయని నిర్ధారించారు. దీంతో వైద్య పరీక్షల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆసుపత్రికి తరలించారు. ప్రాధమిక దశలోనే వైద్యులకు రక్త నమూనాలు ఇవ్వకుండా అతను పరారయ్యాడు. దీంతో గుజరాత్ […]
గుజరాత్‌కు చెందిన ఒక వ్యక్తి యావద్భారతదేశాన్ని భయాందోళనల్లోకి నెడుతున్నాడు. జనవరి 19న చైనా నుంచి 41 ఏళ్ల వ్యక్తి గుజరాత్ చేరుకున్నాడు. జలుబు జ్వరం వేధిస్తుండడంతో అతనిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. పరీక్షలు చేసిన వైద్యులు అతనికి కరోనా వైరస్ లక్షణాలున్నాయని నిర్ధారించారు. దీంతో వైద్య పరీక్షల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆసుపత్రికి తరలించారు. ప్రాధమిక దశలోనే వైద్యులకు రక్త నమూనాలు ఇవ్వకుండా అతను పరారయ్యాడు. దీంతో గుజరాత్ లో ఆందోళన నెలకొంది. కరోనా కేసులు కేవలం కేరళలో బయటపడడంతో వారికి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో గుజరాత్ లో సదరు వ్యక్తి తీరుతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.