నో మాస్క్.. నో లిక్కర్ పాలసీ పాటించాలి
దిశ, నల్లగొండ: మద్యం దుకాణాల వద్ద కరోనా వ్యాప్తి నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎస్పీ ఏవీ రంగనాథ్ సూచించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని ఉదయాదిత్య భవన్‌లో మద్యం దుకాణదారులతో కలెక్టర్, ఎస్పీ సమావేశమై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మద్యం విక్రయించేవారు తప్పనిసరిగా ముఖానికి మాస్కులు, చేతులకు గ్లౌజ్‌లు తప్పనిసరిగా ధరించాలని, శానిటైజర్ కూడా వాడాలని సూచించారు. మాస్క్ లేకుండా వచ్చే వినియోగదారులకు మద్యం విక్రయించరాదని, […]
దిశ, నల్లగొండ: మద్యం దుకాణాల వద్ద కరోనా వ్యాప్తి నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎస్పీ ఏవీ రంగనాథ్ సూచించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని ఉదయాదిత్య భవన్‌లో మద్యం దుకాణదారులతో కలెక్టర్, ఎస్పీ సమావేశమై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మద్యం విక్రయించేవారు తప్పనిసరిగా ముఖానికి మాస్కులు, చేతులకు గ్లౌజ్‌లు తప్పనిసరిగా ధరించాలని, శానిటైజర్ కూడా వాడాలని సూచించారు. మాస్క్ లేకుండా వచ్చే వినియోగదారులకు మద్యం విక్రయించరాదని, నో మాస్క్ నో లిక్కర్ పాలసీ పాటించాలన్నారు. దుకాణాల వద్ద సామాజిక దూరం పాటించాలని, అందుకోసం పెయింట్‌తో శాశ్వతంగా గుర్తులు వేయాలని వివరించారు. సోడియం హైపో క్లోరేట్ ద్రావణం పిచికారీ చేయించాలని ఎక్సైజ్ అధికారులను కలెక్టర్, ఎస్పీ ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, అదనపు ఎస్పీ నర్మద, ఎక్సైజ్ సూపరింటెండెంట్ శంకర్, ఏఈ ఎస్ హిమశ్రీ, ఆర్డీవోలు జగదీశ్వర్ రెడ్డి, రోహిత్ సింగ్, ఎక్సైజ్ సీఐ వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Tags: wine shops, carona restriction mandate, collecter and sp