ఏపీలో ఒక్కరోజే 10,276 కేసులు

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో కరోనా కేసుల్లో మళ్లీ పెరుగుదల కనిపించింది. కరోనా వ్యాప్తి కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టినా.. కేసులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గడచిన 24గంటల్లో కొత్తగా 10,276 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో 1321, చిత్తూరులో 1220, పశ్చిమగోదావరిలో 1033, అనంతపురం జిల్లాలో 1020 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో, ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కేసులసంఖ్య 3,45,216కు పెరిగింది. మరోవైపు […]

Update: 2020-08-22 08:54 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో కరోనా కేసుల్లో మళ్లీ పెరుగుదల కనిపించింది. కరోనా వ్యాప్తి కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టినా.. కేసులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గడచిన 24గంటల్లో కొత్తగా 10,276 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో 1321, చిత్తూరులో 1220, పశ్చిమగోదావరిలో 1033, అనంతపురం జిల్లాలో 1020 కొత్త కేసులు నమోదయ్యాయి.

దీంతో, ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కేసులసంఖ్య 3,45,216కు పెరిగింది. మరోవైపు గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 97 మంది కరోనాతో మరణించారు. తాజా సంఖ్యతో కలిపి రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 3,189కు చేరింది. గత 24 గంటల్లో 61,469 మంది శాంపిల్స్ పరీక్షించగా, 8,593 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News