మన్మోహన్‌ను రాహుల్ గాంధీ అవమానించలేదా?.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

మన్మోహన్ సింగ్(Manmohan Singh) అంత్యక్రియలపై కాంగ్రెస్(Congress) రాజకీయం చేయడం సిగ్గు చేటని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) మండిపడ్డారు.

Update: 2024-12-29 09:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: మన్మోహన్ సింగ్(Manmohan Singh) అంత్యక్రియలపై కాంగ్రెస్(Congress) రాజకీయం చేయడం సిగ్గు చేటని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) మండిపడ్డారు. ఆదివారం కరీంనగర్‌లో ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న పదేళ్లు షాడో ప్రధానిగా సోనియా గాంధీ(Sonia Gandhi) కొనసాగుతూ రబ్బర్ స్టాంప్‌గా మార్చిందని కీలక ఆరోపణలు చేశారు.

అలాగే మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ప్రజా ప్రాతినిధ్యం చట్టంలోని నిబంధనలను సవరిస్తూ ఆర్డినెన్స్ తీసుకొస్తే.. ఆ ఆర్డినెన్స్ కాపీలను రాహుల్ గాంధీ(Rahul Gandhi) చింపివేసి మన్మోహన్‌ను దారుణంగా అవమానించారు. కానీ మన్మోహన్ సింగ్ సేవలను గుర్తించి అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించి ఆయనకు ఢిల్లీలోనే స్మారక స్థల్ నిర్మించేందుకు బీజేపీ ప్రభుత్వం సిద్ధమైందని అన్నారు. కానీ మాజీ ప్రధానిగా పనిచేసిన పీవీ నర్సింహరావు అంత్యక్రియలు ఢిల్లీలో నిర్వహించకుండా అవమానించిన పార్టీ కాంగ్రెస్ అని మండిపడ్డారు. వారికి మోడీ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక అర్హత లేనేలేదని ఫైర్ చేశారు.

Tags:    

Similar News