Dharani Portal: ఇక ఎన్ఐసీ చేతికి ధరణి.. భూ భారతి వెబ్‌సైట్ రూపకల్పనకు కసరత్తు
రాష్ట్ర భూ పరిపాలనలో ధరణి పోర్టల్ నుంచి భూ భారతిగా మారేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర భూ పరిపాలనలో ధరణి పోర్టల్ నుంచి భూ భారతిగా మారేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఐతే టెర్రాసిస్ అనే విదేశీ కంపెనీ నుంచి ధరణి నిర్వహణ పగ్గాలు నేటి నుంచి ఎన్ఐసీ చేతికి చిక్కుతాయి. గత నెల ఒకటో తేదీ నుంచి టెర్రాసిస్ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి ఉంది. కానీ అనేక సాంకేతిక పరమైన చిక్కులను అధిగమించేందుకు సమయం పట్టింది. ఆ కంపెనీ నుంచి పూర్తి డేటా ట్రాన్స్ ఫర్ చేసుకొని కొత్త తరహా టెక్నాలజీని అడాప్ట్ చేసుకునేందుకు ఎన్ఐసీకి రెండు నెలల సమయం పట్టింది. ఏదేమైనా ఇప్పటికిప్పుడు భూ భారతిగా మారే చాన్స్ కనిపించడం లేదు. తెలంగాణ భూ భారతి(రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ బిల్లు, 2024) కొత్త చట్టం ఆమోదం పొందింది. ఈ నెల 18న అసెంబ్లీలో, 20న మండలిలో సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. దీన్ని గవర్నర్ సంతకం కోసం పంపారు. ఇంకా క్లారిటీ రాలేదు. గవర్నర్ ఆమోదించిన తర్వాత గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. భూ భారతి బిల్లును ఎప్పటి నుంచి అమల్లోకి తీసుకురావాలో స్పష్టం చేస్తూ నోటిఫై చేయాలి. నోటిఫై చేసే ముందే ఆర్వోఆర్ 2024 కి రూల్స్ ఫ్రేం చేయాలి. ఈ చట్టం, రూల్స్ ని బట్టి వెబ్ సైట్ డిజైన్ ఉంటుంది. అప్పటి దాకా భూ భారతి అమలు పెండింగులోనే ఉంటుంది. ఐతే ధరణి పోర్టల్ నిర్వహణ టెర్రాసిస్ తో సంబంధం లేకుండా ఎన్ఐసీ బాధ్యతలు నిర్వర్తించడం మొదలైందని సీఎమ్మార్వో ప్రాజెక్టు డైరెక్టర్ మంద మకరందం మంగళవారం ‘దిశ’కు చెప్పారు.
చట్టానికి తగ్గట్లుగా మార్పులు
ట్రాన్సాక్షన్స్, ఆటోమెటిక్ మ్యుటేషన్ విధానమంతా యథాతథంగా ఉంటుంది. కానీ అప్పీల్ చేసుకునేందుకు వెబ్ సైట్ ద్వారా అవకాశం కల్పిస్తారా? లిఖితపూర్వకంగా అప్లై చేసుకోవాలా? దీన్ని బట్టి మాడ్యూళ్ల రూపకల్పన ఉంటుంది. భవిష్యత్తులో భూదార్ టెంపరరీ/ పెర్మినెంట్ నంబర్లు, సేల్ డీడ్ లో సర్వే మ్యాప్ వంటి వాటికి స్థానం కల్పించాలి. అలాగే ఆబాదీ రికార్డుకు కూడా ఏదైనా మాడ్యూల్ ఉండొచ్చు. ఇది కూడా ప్రజలు ఉచితంగానే రికార్డు చూసుకునేందుకు అనువుగా రూపొందించనున్నారు. వారసుల అంశంపై క్రాస్ చెక్ చేసుకునేందుకు కొత్త వ్యవస్థను తీసుకొస్తున్నారు. అలాంటప్పుడు ధరణి పోర్టల్ లో పేర్కొన్న సెల్ఫ్ డిక్లరేషన్ తోనే పని పూర్తయ్యే విధానం రద్దు కానుంది. ప్రస్తుతం పూర్వపు వీఆర్వో, వీఆర్ఏల నుంచి ఆప్షన్ల ద్వారా నియామకం చేపట్టేందుకు ప్రక్రియను మొదలుపెట్టారు. ఆ నియామకాలు కూడా పూర్తి కావాల్సి న అవసరం ఉంది. ఆ తర్వాతే విరాసత్ ప్రక్రియ ముందుకెళ్తుంది. కొత్త ఆర్వోఆర్ చట్టానికి త గ్గట్లుగా మాడ్యూళ్లల్లో మార్పులు తీసుకురావాలి.
వెబ్‌సైట్ బాధ్యత ఎన్ఐసీదే
ధరణి పోర్టల్ లో 35 మాడ్యూళ్లు ఉన్నాయి. ల్యాండ్ డిటెయిల్స్, మార్కెట్ వ్యాల్యూ, ప్రొహిబిటెడ్ లిస్ట్, ఈసీ, ధరణి కంటే ముందు ఈసీ వంటి ఆప్షన్లు 11 వరకు ఉన్నాయి. వీటన్నింటినీ కుదించే ప్లాన్ నడుస్తోంది. ఏదైనా సమస్య ఉంటే ఏ మాడ్యూల్ ద్వారా అప్లై చేయాలో వెతుక్కోవాల్సిన పని లేకుండా సింగిల్ విండో విధానాన్ని అనుసరిస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీలోనే ప్రకటించారు. అప్లై చేసుకున్న తర్వాత అది ఏ తరహా సమస్య అనేది రెవెన్యూ అధికారుల పని. ఈ మేరకు మార్పులు అనివార్యం. అలాగే వెబ్ సైట్ స్క్రీన్ ఎలా ఉండాలన్న దానిపై సీఎం రేవంత్ రెడ్డి కొన్ని సూచనలు చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కనీసం మూడు రకాలుగా డిజైన్ చేసి సీఎం ఆమోదానికి పంపనున్నట్లు సమాచారం. అందులో తుది మెరుగులు దిద్దిన తర్వాతే భూ భారతి వెబ్ పోర్టల్ అందుబాటులోకి రానున్నది.రాష్ట్ర భూ పరిపాలనలో ధరణి పోర్టల్ నుంచి భూ భారతిగా మారేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.
అయితే టెర్రాసిస్ అనే విదేశీ కంపెనీ నుంచి ధరణి నిర్వహణ పగ్గాలు నేటి నుంచి ఎన్ఐసీ చేతికి చిక్కుతాయి. గత నెల ఒకటో తేదీ నుంచి టెర్రాసిస్ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి ఉంది. కానీ, అనేక సాంకేతిక పరమైన చిక్కులను అధిగమించేందుకు సమయం పట్టింది. ఆ కంపెనీ నుంచి పూర్తి డేటా ట్రాన్స్ ఫర్ చేసుకొని కొత్త తరహా టెక్నాలజీని అడాప్ట్ చేసుకునేందుకు ఎన్ఐసీకి రెండు నెలల సమయం పట్టింది. ఏదేమైనా ఇప్పటికిప్పుడు భూ భారతిగా మారే చాన్స్ కనిపించడం లేదు. తెలంగాణ భూ భారతి(రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ బిల్లు, 2024) కొత్త చట్టం ఆమోదం పొందింది. ఈ నెల 18న అసెంబ్లీలో, 20న మండలిలో సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. దీన్ని గవర్నర్ సంతకం కోసం పంపారు. ఇంకా క్లారిటీ రాలేదు. గవర్నర్ ఆమోదించిన తర్వాత గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. భూ భారతి బిల్లును ఎప్పటి నుంచి అమల్లోకి తీసుకురావాలో స్పష్టం చేస్తూ నోటిఫై చేయాలి. నోటిఫై చేసే ముందే ఆర్వోఆర్ 2024 కి రూల్స్ ఫ్రేం చేయాలి. ఈ చట్టం, రూల్స్ ని బట్టి వెబ్ సైట్ డిజైన్ ఉంటుంది. అప్పటి దాకా భూ భారతి అమలు పెండింగులోనే ఉంటుంది. ఐతే ధరణి పోర్టల్ నిర్వహణ టెర్రాసిస్ తో సంబంధం లేకుండా ఎన్ఐసీ బాధ్యతలు నిర్వర్తించడం మొదలైందని సీఎమ్మార్వో ప్రాజెక్టు డైరెక్టర్ మంద మకరందం మంగళవారం ‘దిశ’కు చెప్పారు.
చట్టానికి తగ్గట్లుగా మార్పులు
ట్రాన్సాక్షన్స్, ఆటోమెటిక్ మ్యుటేషన్ విధానమంతా యథాతథంగా ఉంటుంది. కానీ అప్పీల్ చేసుకునేందుకు వెబ్ సైట్ ద్వారా అవకాశం కల్పిస్తారా? లిఖితపూర్వకంగా అప్లై చేసుకోవాలా? దీన్ని బట్టి మాడ్యూళ్ల రూపకల్పన ఉంటుంది. భవిష్యత్తులో భూదార్ టెంపరరీ/ పెర్మినెంట్ నంబర్లు, సేల్ డీడ్ లో సర్వే మ్యాప్ వంటి వాటికి స్థానం కల్పించాలి. అలాగే ఆబాదీ రికార్డుకు కూడా ఏదైనా మాడ్యూల్ ఉండొచ్చు. ఇది కూడా ప్రజలు ఉచితంగానే రికార్డు చూసుకునేందుకు అనువుగా రూపొందించనున్నారు. వారసుల అంశంపై క్రాస్ చెక్ చేసుకునేందుకు కొత్త వ్యవస్థను తీసుకొస్తున్నారు. అలాంటప్పుడు ధరణి పోర్టల్ లో పేర్కొన్న సెల్ఫ్ డిక్లరేషన్ తోనే పని పూర్తయ్యే విధానం రద్దు కానుంది. ప్రస్తుతం పూర్వపు వీఆర్వో, వీఆర్ఏల నుంచి ఆప్షన్ల ద్వారా నియామకం చేపట్టేందుకు ప్రక్రియను మొదలుపెట్టారు. ఆ నియామకాలు కూడా పూర్తి కావాల్సి న అవసరం ఉంది. ఆ తర్వాతే విరాసత్ ప్రక్రియ ముందుకెళ్తుంది. కొత్త ఆర్వోఆర్ చట్టానికి త గ్గట్లుగా మాడ్యూళ్లల్లో మార్పులు తీసుకురావాలి.
వెబ్‌సైట్ బాధ్యత ఎన్ఐసీదే
ధరణి పోర్టల్ లో 35 మాడ్యూళ్లు ఉన్నాయి. ల్యాండ్ డిటెయిల్స్, మార్కెట్ వ్యాల్యూ, ప్రొహిబిటెడ్ లిస్ట్, ఈసీ, ధరణి కంటే ముందు ఈసీ వంటి ఆప్షన్లు 11 వరకు ఉన్నాయి. వీటన్నింటినీ కుదించే ప్లాన్ నడుస్తోంది. ఏదైనా సమస్య ఉంటే ఏ మాడ్యూల్ ద్వారా అప్లై చేయాలో వెతుక్కోవాల్సిన పని లేకుండా సింగిల్ విండో విధానాన్ని అనుసరిస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీలోనే ప్రకటించారు. అప్లై చేసుకున్న తర్వాత అది ఏ తరహా సమస్య అనేది రెవెన్యూ అధికారుల పని. ఈ మేరకు మార్పులు అనివార్యం. అలాగే వెబ్ సైట్ స్క్రీన్ ఎలా ఉండాలన్న దానిపై సీఎం రేవంత్ రెడ్డి కొన్ని సూచనలు చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కనీసం మూడు రకాలుగా డిజైన్ చేసి సీఎం ఆమోదానికి పంపనున్నట్లు సమాచారం. అందులో తుది మెరుగులు దిద్దిన తర్వాతే భూ భారతి వెబ్ పోర్టల్ అందుబాటులోకి రానున్నది.