Yantra India Ltd Jobs: యంత్ర ఇండియాలో జాబ్స్.. కేవలం పదో తరగతి/ఐటిఐ అర్హత ఉంటే చాలు

మీరు పదో తరగతి/ఐటిఐ పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా.. అయితే మీకోసం ప్రభుత్వ రంగ సంస్థ 'యంత్ర ఇండియా లిమిటెడ్‌(Yantra India Ltd)' గుడ్ న్యూస్ చెప్పింది.

Update: 2024-10-29 16:40 GMT

దిశ,వెబ్‌డెస్క్: మీరు పదో తరగతి/ఐటిఐ పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా.. అయితే మీకోసం ప్రభుత్వ రంగ సంస్థ 'యంత్ర ఇండియా లిమిటెడ్‌(Yantra India Ltd)' గుడ్ న్యూస్ చెప్పింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 3883  ట్రేడ్‌ అప్రెంటీస్‌(Trade Apprentice) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 22న ప్రారంభమైంది. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://recruit-gov.com ద్వారా ఆన్‌లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోడానికి చివరి తేదీ 21 నవంబర్ 2024.

పోస్టు పేరు, ఖాళీలు:

  • ఐటిఐ(ITI) - 2498 పోస్టులు
  • నాన్-ఐటిఐ(Non-ITI) - 1385 పోస్టులు

విద్యార్హత:

పోస్టును బట్టి 50 శాతం మార్కులతో పదో తరగతి/ఐటిఐ పూర్తి చేసి ఉండాలి

వయోపరిమితి:

ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయస్సు 14-35 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ:

పదో తరగతి/ఐటిఐలో అభ్యర్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు :

జనరల్ /ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ. 200+జీఎస్టీ.. ఎస్సీ/ఎస్టీ/ దివ్యాంగులు/మహిళలకు రూ. 100+జీఎస్టీ ఉంటుంది.

జీతం:

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.6000 నుంచి రూ. 7,000 వరకు స్టైఫండ్ ఉంటుంది.

Tags:    

Similar News