TG PGECET 2024: పీజీఈసెట్.. ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు!

ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పీజీఈసెట్ ఫస్ట్ ఫేజ్ సీట్ల అలాట్మెంట్ ప్రక్రియ పూర్తయింది.

Update: 2024-09-11 17:14 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పీజీఈసెట్ ఫస్ట్ ఫేజ్ సీట్ల అలాట్మెంట్ ప్రక్రియ పూర్తయింది. ఆయా కోర్సుల్లో కన్వీనర్ కోటాలో మొత్తం 9454 సీట్లుండగా.. 7128 మందికి సీట్లు అలాట్ అయ్యాయని కన్వీనర్ ప్రొఫెసర్ రమేష్ బాబు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అయితే అడ్మిషన్ కు 10,923 మంది వెబ్ ఆప్షన్లు పెట్టుకున్నా.. కొందరికీ సీట్లు అలాట్ కాలేదన్నారు. ఎంఈ, ఎంటెక్ కోర్సుల్లో 5891 సీట్లుంటే.. 4330 మందికి, ఎంఫార్మసీలో 3395 సీట్లుంటే.. 2747మందికి సీట్లు అలాట్ అయినట్టు చెప్పారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఈనెల 19 లోగా కాలేజీల్లో రిపోర్టు చేయాలని సూచించారు. ఈ నెల 23 నుంచి క్లాసులు ప్రారంభం కానున్నాయని కన్వీనర్ స్పష్టంచేశారు.


Similar News