SSC Stenographer: అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. ఎస్‌ఎస్‌సీ స్టెనోగ్రాఫర్ అడ్మిట్ కార్డులు రిలీజ్..!
కేంద్ర ప్రభుత్వ(Central Govt) శాఖల్లో 2,006 స్టెనోగ్రాఫర్(Stenographer) ఉద్యోగాల భర్తీకి సంబంధించి గత జులై నెలలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వ(Central Govt) శాఖల్లో 2,006 స్టెనోగ్రాఫర్(Stenographer) ఉద్యోగాల భర్తీకి సంబంధించి గత జులై నెలలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. వివిధ మంత్రిత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న స్టెనోగ్రాఫర్(గ్రూప్ బీ, నాన్ గెజిటెడ్), స్టెనోగ్రాఫర్ గ్రేడ్-డీ (గ్రూప్ సీ) పోస్టుల భర్తీకి సంబంధించిన రాత పరీక్షలు డిసెంబర్ 10, 11 తేదీల్లో నిర్వహించనున్నారు. అయితే ఈ నియామక పరీక్షలకు సంబంధించి అడ్మిట్ కార్డుల(Admit Cards)ను ఎస్‌ఎస్‌సీ తాజాగా విడుదల చేసింది. అప్లై చేసుకున్న అభ్యర్థులు ఎస్‌ఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్ https://ssc.gov.in/login ద్వారా రిజిస్ట్రేషన్ నంబర్(Registration No), పాస్ వర్డ్(Password) వివరాలు ఎంటర్ చేసి ఎగ్జామ్ సెంటర్(Exam Centre) డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(CBT), స్టెనోగ్రఫీలో స్కిల్ టెస్ట్(Skill Test) ఆధారంగా స్టెనోగ్రాఫర్ పోస్టులకు సెలెక్ట్ చేస్తారు.