SBI Recruitment: బ్యాంక్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఎస్బీఐలో 169 పోస్టులు.. వెంటనే అప్లై చేసుకోండి..!
బ్యాంక్ ఉద్యోగాల(Bank Jobs)కు ప్రిపేర్ అవుతున్న వారికి దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) గుడ్ న్యూస్ చెప్పింది.
దిశ, వెబ్డెస్క్: బ్యాంక్ ఉద్యోగాల(Bank Jobs)కు ప్రిపేర్ అవుతున్న వారికి దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) గుడ్ న్యూస్ చెప్పింది. స్పెషల్ కేడర్ ఆఫీసర్(SCO) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 169 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://bank.sbi/web/careers/current-openings ద్వారా ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోడానికి చివరి తేదీ 12 డిసెంబర్ 2024.
పోస్టు పేరు, ఖాళీలు:
- అసిస్టెంట్ మేనేజర్(ఇంజినీర్- సివిల్) - 42
- అసిస్టెంట్ మేనేజర్(ఇంజినీర్- ఎలక్ట్రికల్) - 25
- అసిస్టెంట్ మేనేజర్(ఇంజినీర్- ఫైర్) - 101
విద్యార్హత:
పోస్టును బట్టి బీఈ/బీటెక్ ఉతీర్ణులై ఉండాలి. అలాగే పని చేసిన అనుభవం కూడా ఉండాలి.
వయోపరిమితి:
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయస్సు 1-10-2024 నాటికి అసిస్టెంట్ మేనేజర్(ఇంజినీర్- ఫైర్) పోస్టులకు 21 నుంచి 40 ఏళ్లు, ఇతర పోస్టులకు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ:
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అప్లికేషన్ షార్ట్ లిస్టింగ్, ఇంటరాక్షన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న ఎస్బీఐ శాఖల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు :
అన్ రిజర్వ్/ ఓబీసీ అభ్యర్థులకు రూ. 750, ఎస్సీ/ఎస్టీ/ దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
జీతం:
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 48,480 నుంచి రూ. 85,920 వరకు సాలరీ ఉంటుంది.