NWR Recruitment: రాత పరీక్ష లేకుండానే నార్త్ వెస్ట్రన్ రైల్వేలో ఉద్యోగ అవకాశాలు

రాజస్థాన్(Rajasthan) రాష్ట్రం జైపూర్(Jaipur)లోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్(RRC)- నార్త్ వెస్ట్రన్ రైల్వే(NWR) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

Update: 2024-11-10 13:32 GMT

దిశ,వెబ్‌డెస్క్: రాజస్థాన్(Rajasthan) రాష్ట్రం జైపూర్(Jaipur)లోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్(RRC)- నార్త్ వెస్ట్రన్ రైల్వే(NWR) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా వర్క్ షాప్/ యూనిట్లలో 1791 యాక్ట్ అప్రెంటిస్(Act Apprentice) పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.rrcjaipur.in ద్వారా ఆన్‌లైన్(Online)లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఈ రోజు(నవంబర్ 10) ప్రారంభమై 10 డిసెంబర్ వరకు కొనసాగనుంది.

పోస్టు పేరు, ఖాళీలు:

యాక్ట్ అప్రెంటిస్ - 1791

విద్యార్హత:

సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు..50 శాతం మార్కులతో పదో తరగతి పూర్తి చేసి ఉండాలి.

వయోపరిమితి:

10 డిసెంబర్ 2024 నాటికి 15-24 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ:

ఐటీఐ మార్కులు, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు.

దరఖాస్తు ఫీజు :

జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు రూ. 100, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

Tags:    

Similar News