NITTTR Job Notification: టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ!
చెన్నై(Chennai)లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్(National Institute of Technical Teachers) లో.. గ్రూప్ ఎ, బి, సి పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
దిశ, వెబ్ డెస్క్: చెన్నై(Chennai)లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్(National Institute of Technical Teachers) లో.. గ్రూప్ ఎ, బి, సి పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
గ్రూప్-ఎ పోస్టులు..
మొత్తం పోస్టులు: 04
- సీనియర్ టెక్నికల్ ఆఫీసర్: 01
- టెక్నికల్ ఆఫీసర్: 03
గ్రూప్-బి పోస్టులు..
మొత్తం పోస్టులు: 05
- సీనియర్ ఆఫీసర్ గ్రేడ్-1/2: 04
- టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్-1: 01
విభాగాలు: అడ్మినిస్ట్రేషన్ అండ్ అకౌంట్స్, సీనియర్ పీఏ టూ డైరెక్టర్, అకౌంట్స్, కెమెరా మ్యాన్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్, ఎడిటర్/ ప్రొడక్షన్ అసిస్టెంట్, సినిమాటోగ్రఫీ ఇంకా ఇతర విభాగాలు.
అర్హత: పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ/బీటెక్, డిగ్రీ, ఎంఈ/ఎంటెక్ తో పాటు వర్క్ ఎక్స్ పీరియెన్స్(Work Experience) ఉండాలి.
వయసు: గ్రూప్-ఎ పోస్టులకు 45 ఏళ్లు, గ్రూప్-బి పోస్టులకు 40 ఏళ్లు మించకూడదు.
వేతనం: టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు నెలకు రూ.56,100 - రూ.1,77,500; సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు నెలకు రూ. 67,000 - రూ.2,08,700; సీనియర్ ఆఫీసర్ గ్రేడ్-1 పోస్టులకు రూ.44,900-1,42,400; మిగతా పోస్టులకు రూ.35,400- 1,12,400.
ఫీజు: రూ.500.(ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/మహిళలు/ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
గ్రూప్-సి పోస్టులు..
మొత్తం పోస్టులు: 22
- సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్: 06
- అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 01
- టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్-2: 02
- సీనియర్ టెక్నీషియన్: 02
- జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్: 02
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్: 08
- టెక్నీషియన్: 01
విభాగాలు: జూనియర్ డ్రాఫ్ట్స్ మ్యాన్, కన్సోల్ ఆపరేటర్, హిందీ ట్రాన్స్ లేటర్, స్టెనో గ్రాఫర్, ఈసీఈ, ఎలక్ట్రానిక్స్, స్టివార్డ్, ఐటీ, సీఎస్ఈ ఇంకా ఇతర విభాగాలు.
అర్హత: 10 వ తరగతి, ఇంటర్మీడియట్, పోస్టును బట్టి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిగ్రీతో పాటు వర్క్ ఎక్స్ పీరియెన్స్(Work Experience) ఉండాలి.
వయసు: 35 ఏళ్లు మించకూడదు.
ఫీజు: రూ. 500; మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు రూ.300; ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/మహిళలు/ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
ఎంపిక: రాత పరీక్ష(Written Test), స్కిల్ టెస్ట్(Skill Test)/ఫిజికల్ టెస్ట్(Physical Test), ఇంటర్వ్యూ(Interview)ల ఆధారంగా ఎంపిక ఉండును.
గ్రూప్ ఎ, బి, సి ఉద్యోగాలకు...
పని ప్రదేశాలు: హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, చెన్నై, కలమస్సేరి.
ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 10, 2024.
వెబ్ సైట్: https://www.nitttrc.ac.in/