NIT: వరంగల్ నిట్ లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు.. డీటెయిల్స్ ఇవే..!

వరంగల్(warangal)లోని నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(NIT) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

Update: 2024-12-03 13:34 GMT

దిశ, వెబ్‌డెస్క్: వరంగల్(warangal)లోని నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(NIT) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా వివిధ గ్రూపుల్లో ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్(Non-Teaching) పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా https://nitw.ac.in/Careers/ ఆన్‌లైన్(Online) విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోడానికి చివరి తేదీ 7 జనవరి 2025.

పోస్టు పేరు, ఖాళీలు:

నాన్ టీచింగ్ - 56

విద్యార్హత:

పోస్టును బట్టి సంబధిత విభాగంలో 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్, ఎంసీఏ పూర్తి చేసి ఉండాలి. అలాగే పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి:

ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు వయసు 56 ఏళ్లకు మించి ఉండకూడదు. 

ఎంపిక ప్రక్రియ:

సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు:

జనరల్/ఓబీసీ అభ్యర్థులకు రూ.1,000. ఎస్సీ, ఎస్టీ, దివ్యంగ, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

Tags:    

Similar News