ఐబీలో 797 జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఖాళీలు

కేంద్ర హోంమంత్రిత్వశాఖ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

Update: 2023-06-05 09:04 GMT

దిశ,వెబ్‌డెస్క్: కేంద్ర హోంమంత్రిత్వశాఖ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఐబీలో మొత్తం 797 జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది. ఈ ఉద్యోగాలకు అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు: జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (జేఐవో) గ్రేడ్ -2 /టెక్నికల్ - 797వీటిలో అన్‌రిజర్వ్‌డ్ - 325,ఎస్సీ - 119, ఎస్టీ -59, ఓబీసీ - 215, ఈడబ్ల్యూఎస్ - 79 ఉన్నాయి.
అర్హత: నోటిఫికేషన్‌లొ పేర్కొన్నవిధంగా సంబంధిత సబ్జెక్టులలో డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ లేదా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ,ఎస్టీలకు ఐదేళ్లు/ఓబీసీలకు మూడేళ్లు చొప్పున వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
వేతనం: నెలకు రూ. 25,500 నుంచి రూ. 81,100 ఉంటుంది. దీనికి తోడు అలవెన్సులు అదనంగా లభిస్తాయి.
ఎంపిక: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక నిర్వహిస్తారు.
అప్లికేషన్ ఫీజు: రూ. 500 చెల్లించాలి.
ఏపీ, తెలంగాణల్లో పరీక్షా కేంద్రాలు: అనంతపురం, చీరాల, గుంటూరు, కడప, కాకినాడ, కర్నాలు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్/సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్.
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభతేదీ: జూన్ 3, 2023.
చివరితేదీ: జూన్ 23, 2023.
వెబ్‌సైట్: https://www.mha.gov.in

Tags:    

Similar News