GATE 2023: గేట్ 2023 అడ్మిట్ కార్డ్‌లు రిలీజ్

గేట్(గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ ఇన్ ఇంజినీరింగ్ పరీక్ష 2023కు సంబంధించి అడ్మిట్ కార్డులను వెబ్‌సైట్‌లో ఐఐటీ కాన్పూర్ విడుదల చేసింది.

Update: 2023-01-09 10:02 GMT
GATE 2023: గేట్ 2023 అడ్మిట్ కార్డ్‌లు రిలీజ్
  • whatsapp icon

దిశ, డైనమిక్ బ్యూరో : గేట్(గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ ఇన్ ఇంజినీరింగ్ పరీక్ష 2023కు సంబంధించి అడ్మిట్ కార్డులను వెబ్‌సైట్‌లో ఐఐటీ కాన్పూర్ విడుదల చేసింది. గేట్ పరీక్ష 2023 కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అడ్మిట్ కార్డ్‌లను ఐఐటీ కాన్పూర్ అధికారిక వెబ్‌సైట్ gate.iitk.ac.in .నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. గేట్ పరీక్ష- 2023 దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 4, 5, 11, 12 తేదీల్లో నిర్వహించనున్నారు. ఫలితాలు 16 మార్చి 2023న విడుదల చేయబడతాయి. తొలుత జవవరి 3వ తేదీన అడ్మిట్ కార్డులు విడుదల చేస్తామని ప్రకటించినా... పలు సాంకేతిక కారణాల వల్ల ఈరోజు విడుదల చేశారు.

Tags:    

Similar News